Health: ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.! ట్యాబ్లెట్ల తయారీలో ఆ ఫ్రూట్..
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే వైద్యులు కూడా సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు. ఇటీవల రకరకాల ఫ్రూట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న పండ్లలో గ్యాక్ ఫ్రూట్ కూడా ఒకటి. దీన్నే అడవి కాకర అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ పండ్లు ఆరెంజ్, ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
గ్యాక్ ఫ్రూట్.. ఈ పండు ఎక్కువగా ఆస్ట్రేలియా, థాయ్ లాండ్, మలేషియా, వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో కూడా లభిస్తుంది. ఈ పండు పుచ్చకాయ జాతికి చెందినది. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ పండు ఖరీదు కూడా ఎక్కువే. గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా దరి చేరదు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఈ పండును పలు రకాల ట్యాబ్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ పండు దాదాపు అరకిలో నుంచి కిలో బరువు ఉంటుంది. ఈ పండుతో సూప్‌లు, కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తీగ జాతికి చెందిన మొక్క. క్యాన్సర్ ఉన్నవారు ఈ పండు తింటే త్వరగా కోలుకుంటారు. ఈ పండు శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకుంటుంది. దెబ్బ తిన్న కణాలను కూడా రిపేర్ చేస్తుంది. కంటి సమస్యలు, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలను అడ్డుకుంటుంది. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.