Watch Video: న్యూ ఇయర్‌ వేళ రోడ్డుపై పల్టీలు కొట్టిన స్కూల్‌ బస్సు.. ఐదో తరగతి బాలిక దుర్మరణం! వీడియో

కొత్త ఏడాది రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి ఇంటికి విద్యార్ధులను తీసుకువెళ్తున్న స్కూల్ బస్సు ఒకటి రోడ్డుపై ప్రమాదవ శాత్తు బోర్లా పడింది. ఈ ఘటనలో ఐదో తరగతి విద్యార్ధిని బస్సులో నుంచి జారి పడి.. అదే బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందింది. మరో 15 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

Watch Video: న్యూ ఇయర్‌ వేళ రోడ్డుపై పల్టీలు కొట్టిన స్కూల్‌ బస్సు.. ఐదో తరగతి బాలిక దుర్మరణం! వీడియో
School Bus Flips Over In Kerala
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2025 | 9:48 AM

కన్నూర్, జనవరి 2: నూతన సంవత్సర వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అంబరాన్నంటాయి. కానీ ఓ కుటంబంలో మాత్రం అంతులేని విషాదాన్ని నింపింది. ఉదయాన్నే విద్యార్ధులకు స్కూల్‌కు తీసుకెళ్తున్న ఓ స్కూల్‌ బస్సు ప్రమాదవశాత్తు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో ఐదో తరగతి చవువుతున్న ఓ బాలిక స్కూల్ బస్సులో నుంచి జారి కింద పడి.. అదే బస్సు చక్రాల కింద నలిగిపోయింది. దీంతో విద్యార్ధిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లో బుధవారం (జనవరి 1) చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కేరళలోని కన్నూర్‌లో కురుమత్తూరు శ్రీకంఠాపురంలోని వాళక్కైలోని చిన్మయ విద్యాలయం చెందిన విద్యార్ధులు స్కూల్‌ ముగియడంతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విద్యార్ధులను ఇళ్లకు చేర్చేందుకు స్కూల్‌ బస్సు బయల్దేరింది. ఈ స్కూల్‌ బస్సు 15 మంది విద్యార్థులతో రోడ్డుపై వెళ్తుంది. ఓ వీధిలో నుంచి హైవే పైకి ప్రవేశిస్తుండగా మలుపులో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. దీంతో స్కూల్ బస్సు రోడ్డుపై పలుమార్లు పల్టీ కొట్టింది. ఈ క్రమంలో ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల నేద్య ఎస్ రాజేష్ అనే విద్యార్ధి బస్సులో నుంచి బయటకు విసురుగా పడిపోయాడు. అనంతరం అదే బస్సు చక్రాల కింద నలిగిపోయాడు. దీంతో చిన్నారి రాజేష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. బస్సులోని 13 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. బ్రేకు ఫెయిల్యూర్ వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

స్తానికుల సహాయంతో గాయపడిన 13 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం తాలిపేరు తాలూకా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బాలిక మృతదేహాన్ని పరియారం ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. స్కూల్‌ బస్సు డ్రైవర్‌పై పోలీసులు భారతీయులపై సెక్షన్‌లు 281, 125 (ఎ) (నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం కలిగించడం), 106 (1) (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద న్యాయ సంహిత కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు కారణంగా ప్రమాదం జరిగినట్లు నివాసితులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు కారణంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు ఇటువంటి సంఘటనలు జరిగినట్లు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.