Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోరం.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

భర్త మద్యానికి బానిసయ్యాడు.. తరచూ ఇదే విషయంపై దంపతులు ఇద్దరూ గొడవ పడేవారు.. భర్త వేధిస్తున్నాడంటూ భార్య తరచూ చెబుతుండేది.. కానీ.. ఓ రోజు భార్య దారుణ నిర్ణయం తీసుకుంది.. భర్త నిద్రిస్తున్న సమయంలో దారుణంగా చంపేసింది.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది.. అనంతరం ఆ ముక్కలను తీసుకెళ్లి ఓ దగ్గర పడేయడం కలకలం రేపింది.

ఘోరం.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2025 | 12:40 PM

పెళ్లై ఎంతో కాలమైంది.. భార్యభర్తలిద్దరూ మొదట్లో బాగానే ఉండేవారు.. నలుగురు సంతానం.. ఆ తర్వాత భర్త మద్యానికి బానిసయ్యాడు.. తరచూ ఇదే విషయంపై దంపతులు ఇద్దరూ గొడవ పడేవారు.. భర్త వేధిస్తున్నాడంటూ భార్య తరచూ చెబుతుండేది.. ఈ క్రమంలోనే శారీరక సంబంధానికి భార్య ఒప్పుకోలేదన్న కారణంతో తన కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు.. కూతురిపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించడంతో భార్య దారుణ నిర్ణయం తీసుకుంది.. భర్త నిద్రిస్తున్న సమయంలో దారుణంగా చంపేసింది.. అంతటితో ఆగకుండా.. ముక్కలు ముక్కలుగా నరికి పొలంలో పడేసింది.. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది. భర్తను భార్య చంపిన ఘటన గురువారం తెల్లవారుజామున బెలగావి చిక్కోటి తాలూకా ఉమారాణి గ్రామంలో జరిగింది.. భర్తను చంపిన తర్వాత.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి గ్రామ శివారు పొలంలోని బావి వద్ద పడేసిందనరి పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంచలనంగా మారింది..

పోలీసుల కథనం ప్రకారం.. చొక్కోటి ప్రాంతంలోని ఉమారాణి గ్రామానికి చెందిన శ్రీమంత హిట్నల్, సావిత్రి భార్యాభర్తలు.. వారికి నలుగురు సంతానం ఉన్నారు.. కొంతకాలం వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు.. ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు.. అయితే.. భర్త ఏ పని చేయకుండా నిత్యం మద్యం తాగుతుండటంతో భార్య.. వద్దని వారించేది.. ఈ విషయం మీద దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త.. ఫుల్లుగా తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. భర్త.. శారీరక సంబంధానికి  ప్రయత్నించడంతో భార్య వద్దని వారించింది.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతటితో ఆగకుండా భర్త కూతురిపై బలాత్కారం చేయబోవడంతో.. భార్య భర్తపై కోపంతో రగిలిపోయింది.. రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య.. భర్త తలపై బండరాయితో మోది హతమార్చింది. ఆపై మృతదేహం కనిపించకుండా చేయడానికి రెండు ముక్కలుగా నరికింది.. అనంతరం బకెట్ లాంటి పాత్రలో ఉంచి .. గ్రామ శివారుకు తీసుకెళ్లి పొలం దగ్గర పడేసింది..

అనంతరం ఇంటికి చేరుకుని రక్తపు మరకలు కనిపించకుండా శుభ్రం చేసింది..భర్త దుస్తులతోనే రక్తపు మరకలు శుభ్రం చేసి.. వాటిని కూడా మాయం చేసింది.. దుస్తులను కాల్చింది.

అయితే.. ముక్కలుగా ఉన్న శ్రీమంత్ మృతదేహం చూసి.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు.. భార్య సావిత్రినే ఈ ఘోరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.. కాగా.. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిరుద్యోగులకు రూ.3 లక్షల రుణం... ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్
నిరుద్యోగులకు రూ.3 లక్షల రుణం... ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్
బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్
బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్
అందం మైమరచిపోతుంది ఈ సొగసరి సోయగానికి.. డేజ్లింగ్ మీనాక్షి..
అందం మైమరచిపోతుంది ఈ సొగసరి సోయగానికి.. డేజ్లింగ్ మీనాక్షి..
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
'లేడీ లక్'తో ఐపీఎల్ 2025 బరిలోకి.. లిస్ట్ చాలా పెద్దదే భయ్యో
'లేడీ లక్'తో ఐపీఎల్ 2025 బరిలోకి.. లిస్ట్ చాలా పెద్దదే భయ్యో
సన్‌రూఫ్ కార్లంటే ఇష్టమా..? టాప్ ఫీచర్లు ఉన్న కార్లు ఇవే..!
సన్‌రూఫ్ కార్లంటే ఇష్టమా..? టాప్ ఫీచర్లు ఉన్న కార్లు ఇవే..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే
ఈ కోతి తెలివి తేటలు చూస్తే.. మీరు బిత్తరపోవాల్సిందే...
ఈ కోతి తెలివి తేటలు చూస్తే.. మీరు బిత్తరపోవాల్సిందే...
శనీశ్వరుడి కటాక్షం. ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు దిశ తిరగబోతోంది.
శనీశ్వరుడి కటాక్షం. ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు దిశ తిరగబోతోంది.
ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? పొరపాటున ఇలా
ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? పొరపాటున ఇలా