భార్యతో గొడవ.. అలిగి బావిలో దూకేసిన భర్త! అతణ్ణి కాపాడబోయి మరో నలుగురు మృతి

భార్యభర్తల గొడవ ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. భార్యపై కోపంతో భర్త బావిలో దూకగా.. అతడిని కాపాదేందుకు స్థానికులు ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. అయితే ఆ బావిలో దిగిన వారెవ్వరూ మళ్లీ తిరిగి బయటకు రాలేదు. మొత్తం ఐదుగురు వ్యక్తులు బావిలో దుర్హరణం చెందారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది..

భార్యతో గొడవ.. అలిగి బావిలో దూకేసిన భర్త! అతణ్ణి కాపాడబోయి మరో నలుగురు మృతి
Domestic Dispute
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2025 | 10:25 AM

హజారీబాగ్‌, జనవరి 2: కొత్త ఏడాది రోజున ఓ జంట కీచులాడుకున్నారు. అదికాస్తా చిరిగి చిరిగా గాలివానగా మారింది. దీంతో భార్యపై ఆగ్రహంతో అలిగిన భర్త వెంటనే పెరట్లోని బావిలో దూకేశాడు. గమనించిన ఇరుగు పొరుగు అతడిని కాపాడబోయి ఒకరటి తర్వాత ఒకరుగా ఐదుగురు దూకేశారు. దీంతో ఐదుగురు వ్యక్తులను ఆ బావి ఒకేసారి మింగేసింది. ఈ షాకింగ్‌ ఘటన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

జార్ఖంగ్‌లోని బిష్ణుగఢ్‌ సమీపంలోని చార్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వహా గ్రామంలో సుందర్‌ కుర్మలి (27) తన భార్య రూపా దేవితో జనవరి 1వ తేదీన (బుధవారం) ఇంట్లో ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన సుందర్‌ తన బైక్‌ను వేగంగా నడుపుకుంటూ బైక్‌ను బావిలోకి తోసేశాడు. కాసేపటి తర్వాత బైక్‌ను తీసేందుకు బావిలోకి దిగాడు. కానీ అతను ఎంతకూ తిరిగి రాలేదు. భయాందోళనలకు గురైన భార్య రుపా తన భర్తను రక్షించాలంటూ కేకలు వేసింది. గమనించిన ఇరుగు పొరుగు సుందర్‌ను కాపాడటం కోసం ఒకరి తర్వాత మరొకరు నలుగురు బావిలో దిగారు. సుందర్‌తోపాటు ఆ నలుగురు కూడా తిరిగిరాలేదు. ఈ ఐదుగురు బావిలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని రాహుల్ కర్మాలి, వినయ్ కర్మాలి, పంకజ్ కర్మాలి, సూరజ్ భుయాన్‌గా పోలీసులు గుర్తించారు. మృతులందరూ 25 నుంచి 28 యేళ్లలోపువారే.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్‌డీపీఓ తెలిపారు. ఐదుగురిని మింగేసిన బావి సమీపంలోకి వెళ్లేందుకు కూడా స్థానికులు జంకుతున్నారు. బాధితులు విషవాయువు పీల్చడం వల్లే మరణించి ఉంటారని చార్హి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి గౌతమ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. మరణాలకు ఖచ్చితమైన కారణం దర్యాప్తులో తేలుతుందని ఆయన తెలిపారు. దీంతో ఆ బావిని మూసివేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.