AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుక కోసుకుని దేవుడికి సమర్పించి, ధ్యానంలో మునిగిపోయిన పదహారేళ్ల అమ్మాయి..!

బిడ్డలను బలిస్తే బతికి మళ్లీ తిరిగొస్తారా.. కన్నెపిల్లలను చంపితే అతీంద్రియ శక్తులు సిద్ధిస్తాయా.. మహిళలను చంపి వండుకుని తింటే సంపన్నులైపోతారా..? పైకం కోసం కొందరీ మైకంలో పడితే.. మరికొందరు ముల్లోకాలనూ జయించే శక్తులు సిద్ధిస్తాయన్న అపోహతో మూఢనమ్మకాలతో అమాయకులను బలిచేస్తున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక నాలుక కోసుకుని దేవుడిని సమర్పించింది.

నాలుక కోసుకుని దేవుడికి సమర్పించి, ధ్యానంలో మునిగిపోయిన పదహారేళ్ల అమ్మాయి..!
Symbolic Image
Balaraju Goud
|

Updated on: Jan 02, 2025 | 11:11 AM

Share

భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించడం మీరు చూసి ఉంటారు. రకరకాల వస్తువులు సమర్పించడం వినే ఉంటారు. కానీ ఎవరైనా తన నాలుకను కత్తిరించి దేవునికి సమర్పించారని మీరు ఎప్పుడైనా విన్నారా..? ఛత్తీస్‌గఢ్‌లో ఓ అమ్మాయి దేవుడికి నాలుకను నైవేద్యంగా పెట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ అమ్మాయి నాలుక కోసుకుని దేవుడికి సమర్పించి గుడి ఆవరణలో కూర్చుని ధ్యానం చేసింది. ఆ బాలిక తనకు చికిత్స చేయించుకోవడానికి కూడా నిరాకరించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లా దేవరఘట గ్రామానికి చెందిన ఆరుషి చౌహాన్ అనే బాలిక దేవుడికి ఈ నైవేద్యాన్ని సమర్పించింది. 11వ తరగతి చదువుతూన్న 16 ఏళ్ళ ఆరుషి తన నాలుకను గుడిలోనే కోసి దేవుడికి సమర్పించింది. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో కూర్చుని పూజలు చేయడం ప్రారంభించింది. ఆరుషి కుటుంబీకుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సాధన నుంచి లేస్తే చంపేస్తానని రాసి ఉన్న ‘నోట్’ ఆమె వద్ద లభించింది.

ఆరుషి నుంచి నోట్ దొరికిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. చత్తీస్‌గఢిలో “కక్రో ఆవాజ్ నహీ ఆనీ చాహియే, గాడి మన్ కక్రో నహీ” అని రాసి ఉంది. తర్వాతి పేజీలో “నేను లేచానంటే అందరిని చంపేస్తా” అని రాసి ఉంది. అంటే ఏ వాహనం లేదా ఏ వ్యక్తి శబ్దం చేయకూడదు. ధ్యానం భగ్నం చేయాలని చూస్తే, హత్య చేస్తానని తర్వాతి పేజీలో రాసి ఉంది. ఆరుషి మరో రెండు రోజులు ధ్యానంలో నిమగ్నమై ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో పాటు వైద్యుల బృందాన్ని కూడా తీసుకువచ్చారు. అయితే బాలిక చికిత్స చేయించుకునేందుకు నిరాకరించింది. ఆమె ధ్యానం నుండి మేల్కొనలేదు. ఆరుషి కుటుంబీకులు కూడా ఈ విషయాన్ని బాలికకు వివరించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులను ఆలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారులు కూడా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..