- Telugu News Photo Gallery Black coffee Benefits: mix these Four spices in black coffee for weight loss
Black Coffee: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..! బ్లాక్ కాఫీలో ఈ మసాలా దినుసులు కలపండి..
కొంత మంది బ్లాక్ కాఫీని ఇష్టపడతారు. బరువు తగ్గడానికి కొంతమంది తరచుగా బ్లాక్ కాఫీని తాగుతారు. రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీని తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ బ్లాక్ కాఫీకి మరికొన్ని మసాలాలు జోడించి తాగితే ఆ కాఫీ మరింత రుచికరంగా ఉండడమే కాదు.. మరింత ప్రభావంగా ఆరోగ్యకరం అని చెబుతున్నారు. ఈ రోజు బ్లాక్ కాఫీలో ఏ మసాలా దినుసులు కలపడం ఆరోగ్యకరమో తెలుసుకుందాం..
Updated on: Jan 02, 2025 | 10:33 AM

ఆహారం, వ్యాయామంతో పాటు కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా బరువు తగ్గడంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. బ్లాక్ కాఫీలో కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులు కలిపితే.. దాని ప్రయోజనం మరింత పెరుగుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. ఈ నేపధ్యంలో బ్లాక్ కాఫీని ప్రతిరోజూ తాగడంతోపాటు వంటగదిలో ఉండే కొన్ని మసాలా దినుసులను చేర్చినట్లయితే.. అది మరింత రుచికరంగా ఉండడమే కాదు.. బరువు తగ్గించే ప్రయత్ననాన్ని మరింత సులభతరం చేస్తుంది.

మసాలాలు బరువు తగ్గించడంలో సహాయపడే పోషకాలను కలిగి ఉంటాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కనుక ఎవరైనా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. అది కూడా సహజ పద్ధతులను అవలంబిస్తూ బరువు తగ్గాలనుకుంటే బ్లాక్ కాపీలో కొన్ని రకాల మసాలా దినుసులను జోడించండి. వీటిని కలపడం వలన కాఫీ రుచిని పెంచడమే కాదు శరీరానికి కూడా మేలు చేస్తాయి.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని కొవ్వును కాల్చడంలో సహాయపడతాయి. అందువల్ల బ్లాక్ కాఫీని తాగినప్పుడల్లా.. ఆ కాఫీ లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపండి.

Black Coffee

అధికంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన , గుండెల్లో మంట వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి, మితంగా తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే, మీకు డయాబెటిస్ ఉంటే, బ్లాక్ కాఫీ తాగడానికి ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

తక్కువ మోతాదులో బ్లాక్ కాఫీ తీసుకోవటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీ శారీరక పనితీరును పెంచుతుంది. వ్యాయామం చేసే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది.

ఎలా ఉపయోగించాలంటే.. బ్లాక్ కాఫీలో ఈ మసాలా దినుసుల్లో ఏదోక దానిని మిక్స్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. వీలైతే.. బరువు తగ్గడంలో శీఘ్ర ఫలితాలు దక్కాలంటే రోజుకు 1-2 సార్లు త్రాగండి. అయితే ఇలాంటి కాఫీలో చక్కెర, క్రీమ్ వంటి వాటిని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. తద్వారా బ్లాక్ కాఫీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు చెక్కుచెదరకుండా ఉంటాయి.




