AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్..! ఇకపై నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం..!

ఇల వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలతో సమానంగా యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, విఐపి దర్శనాలు, ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దారు. ఏడుకొండల ఎంకన్న తరహాలోనే.. యాదాగిరి గుట్ట నర్సన్న ఆలయంలో కూడా టికెట్లును ఆన్‌లైన్‌లో పొందే విధంగా ఏర్పాటు చేసింది యాదాద్రి దేవస్థానం.

వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్..! ఇకపై నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం..!
Yadagiri Gutta
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 02, 2025 | 11:09 AM

Share

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తుల అవసరాలకు పెద్దపీట వేస్తోంది. తెలంగాణ తిరుపతిగా పేరుందిన యాదగిరిగుట్టలో పాంచ నారసింహుడి ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి ఎక్కువ అవుతోంది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సాధారణ రోజుల్లో 40వేల మంది, ఆదివారం సెలవు దినాల్లో 60 వేల మందిపైగా భక్తులు వస్తున్నారు. దీంతో యాదిగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది.

దేవస్థానం ఇప్పటికే భక్తుల వసతి సౌకర్యాలు కల్పనకు ప్రయత్నిస్తోంది. భక్తుల రద్దీ ఉండడంతో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులు స్వామివారి దర్శనం ఇబ్బందిగా మారుతోంది. వీరు ఇబ్బందులపై దేవస్థానం దృష్టి సాధించింది. ఇందులో భాగంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది పాలక మండలి.

కొండపై ఉన్న ప్రధాన ఆలయ తూర్పు ద్వారం ముందు ఏడడుగుల గేట్‌తో కూడిన గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. తూర్పు ద్వారం ముందు దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు కూర్చోవడానికి బెంచీలు, కుర్చీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీరి కోసం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11.30గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 5.30గంటల సమయంలో వీరికి స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఆలయ సిబ్బంది వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లులను ప్రత్యేక క్యూ లైన్‌లో తీసుకెళ్లి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..