Beauty Care Tips: నెయిల్ ఆర్ట్ అంటే ఇష్టమా.. డబ్బు ఖర్చు ఎందుకు దండగ.. ఇంట్లో ఈ వస్తువులుండగా..

నాటి నుంచి నేటి యువత వరకూ అందం అంటే ఇష్టపడతారు. అందంగా ఉండడం కోసం రకరకాల చర్యలు తీసుకుంటారు. ముఖం మాత్రమే కాదు చేతులు, కాలి వెళ్ళు కూడా అందంగా కనిపించాలని భావిస్తారు. గోరింటాకు స్థానంలో గోర్లకు రంగులు వేసుకునేవారు. ఇప్పుడు మరింత అప్ డేట్ అయి నెయిల్స్ కు అందమైన డిజైన్స్ కూడా అప్లై చేస్తున్నారు. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ ట్రెండ్‌లో ఉంది. మహిళలు ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టి గంటల తరబడి సెలూన్లలో గడుపుతున్నారు. అయితే సెలూన్‌కి వెళ్లకుండానే ఇంట్లో కూడా నెయిల్ ఆర్ట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి గోర్లకు అందమైన డిజైన్స్ ను వేసుకోవచ్చు.

Beauty Care Tips: నెయిల్ ఆర్ట్ అంటే ఇష్టమా.. డబ్బు ఖర్చు ఎందుకు దండగ.. ఇంట్లో ఈ వస్తువులుండగా..
Nail Art At Home
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2025 | 11:21 AM

ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ ఒక ట్రెండ్‌గా మారింది. గోర్లను అందంగా అలంకరించుకోవడానికి వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అందమైన, సృజనాత్మకమైన నెయిల్ డిజైన్‌లను ఇష్టపడుతున్నారు. అయితే ఈ నెయిల్ ఆర్ట్ కోసం ప్రతిసారీ సెలూన్‌కి వెళ్లడం అంటే అది ఖరీదైన అలవాటు. అంతేకాదు దీని కోసం సమయం కూడా కేటాయించాల్సి ఉంటుంది. అయితే కొంచెం శ్రద్ధ, కొంచెం ఓపిక ఉంటే ఇంట్లోనే అద్భుతమైన నెయిల్ ఆర్ట్‌ను సులభంగా వేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో వంటగదిలో లభించే వస్తువులను ఉపయోగించడం ద్వారా.. ఇంట్లో నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు. దీని వలన కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. సౌకర్యాన్ని బట్టి వేసుకోవచ్చు. అంతేకాదు మీకు నచ్చిన మెచ్చిన డిజైన్‌లను వేసుకోవచ్చు.

దీని కోసం మీకు ఖరీదైన సాధనాలు లేదా ఉత్పత్తులు అవసరం లేదు. కొంచెం సృజనాత్మకత, కొంచెం సహనం ఉంటే చాలు మీ గోళ్లను మీరే అందంగా చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్ వేసుకోవడం సరదాగా ఉండటమే కాదు.. మీలో సృజనాత్మకతను కూడా పెంచుతుంది. ఈ రోజు ఇంట్లోనే నెయిల్ ఆర్ట్ వేసుకోగలిగే కొన్ని వస్తువులు.. వాటితో ఎలా గోర్లను అందంగా అలంకరించాలి అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం..

టూత్‌పిక్ లేదా సేఫ్టీ పిన్

నెయిల్ ఆర్ట్ కోసం టూత్‌పిక్ లేదా సేఫ్టీ పిన్‌ని ఉపయోగించవచ్చు. ఇది చాలా సులభమైన, ఆహ్లాదకరమైన పద్ధతి. ఎవరైనా వీటితో అందంగా డిజైన్స్ వేసుకోవాలంటే చేయాల్సిందల్లా ముందుగా మీ గోళ్లపై మీకు ఇష్టమైన నెయిల్ పెయింట్‌ను అప్లై చేసుకోవాలి. అనంతరం టూత్‌పిక్ లేదా సేఫ్టీ పిన్ సహాయంతో చిన్న చుక్కలు లేదా ఏదైనా చుక్కల డిజైన్ వేసుకోవచ్చు. నెయిల్ పాలిష్‌లో టూత్‌పిక్ లేదా సేఫ్టీ పిన్‌ను ముంచి పోల్కా డాట్‌లు లేదా పూల డిజైన్‌లను గోర్లపై అప్లై చేయండి.

ఇవి కూడా చదవండి

స్పాంజ్

నెయిల్ ఆర్ట్ ను వేయడానికి స్పాంజ్‌లను కూడా ఉపయోగించవచ్చు. గోళ్లపై గ్రేడియంట్ లేదా ఓంబ్రే లుక్ కనిపించాలనుకుంటే స్పాంజ్ ను ఉపయోగించవచ్చు. దీని కోసం ముందుగా స్పాంజ్‌పై నెయిల్ పాలిష్‌ను అప్లై చేసి గోళ్లపై తేలికగా నొక్కండి. అప్పుడు గోర్లు అందంగా భిన్నమైన లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటాయి.

టేప్

ఈ రోజుల్లో చారలు, జామెట్రిక్ డిజైన్‌లను చాలా ఇష్టపడుతున్నారు. ఈ డిజైన్స్ ను వేసుకోవడం కూడా చాలా సులభం. దీని కోసం మీరు టేప్ ఉపయోగించవచ్చు. చేయాల్సిందల్లా ముందుగా మీ గోళ్లపై మీకు ఇష్టమైన నెయిల్ పాలిష్‌ను అప్లై చేసి.. ఆపై ఆ కలర్ పై ఒక టేప్ ను అంటించండి. దీని తరువాత మరొక రంగు నెయిల్ పాలిష్ ను అప్లై చేయండి. ఆరిన తర్వాత టేప్‌ను తీసివేసి.. నేచరల్ కలర్ రంగుని అప్లై చేయండి.

బాబీ పిన్

బాబీ పిన్స్ హెయిర్ స్టైల్ కోసమే కాదు నెయిల్ ఆర్ట్ కోసం కూడా ఉపయోగిస్తారు. బాబీ పిన్ రౌండ్ ఎండ్‌తో పెద్ద చుక్కలు లేదా సర్కిల్‌లను చేసుకోవచ్చు. మొదట గోర్లకు నెయిల్ పాలిష్ అప్లై చేయాలి. తర్వాత బాబీ పిన్స్ సహాయంతో చుక్కలు లేదా ఇష్టమైన డిజైన్‌ను వేసుకోవచ్చు. మెరుస్తూ అందంగా కనిపించాలనుకుంటే నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఆ నెయిల్ పెయింట్ పై గ్లిట్టర్‌ను చల్లుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..