AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్‌కు ఛూమంత్రం.. ఈ అద్భుమైన టీతో బ్లడ్ షుగర్ ఇట్టే కంట్రోల్..

డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోంది.. ఇప్పటికే.. కోట్లాది మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు.. అయితే.. మనం ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగే చక్కెర, పాలు ఉన్న టీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రమాదాన్ని పెంచుతుంది.. బదులుగా మీరు ఈ ప్రత్యేకమైన టీని తాగడం అలవాటు చేసుకుంటే.. డయాబెటిస్ అదుపులో ఉండటంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

డయాబెటిస్‌కు ఛూమంత్రం.. ఈ అద్భుమైన టీతో బ్లడ్ షుగర్ ఇట్టే కంట్రోల్..
Oolong Tea
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2025 | 11:47 AM

Share

డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఐసీఎంఆర్ డేటా ప్రకారం.. భారతదేశంలోనే 10 కోట్ల మంది మధుమేహం బాధితులు ఉన్నారు.. వాస్తవానికి డయాబెటిక్ రోగుల జీవితం ఇతరులకన్నా కొంచెం కష్టంగా ఉంటుంది.. ఎందుకంటే వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని వారు ఎల్లప్పుడూ భయపడతారు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.. ఒక్కోసారి మధుమేహ వ్యాధిగ్రస్తులు కిడ్నీ వ్యాధి, గుండెపోటు, బలహీనమైన కంటి చూపు ప్రమాదానికి గురవుతారు. అటువంటి ప్రమాదాలను నివారించడానికి, మీరు మొదట పాలు, చక్కెరతో కూడిన టీని నివారించాలి. బదులుగా ఊలాంగ్ టీని ప్రయత్నిస్తే.. అద్భుతమైన ప్రయోజనం ఉంటుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ఊలాంగ్ టీలో లభించే పోషకాలు:

ఊలాంగ్ టీలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కెరోటిన్, సెలీనియం, మాంగనీస్, కాపర్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. అందుకే.. ఊలాంగ్ టీని పోషకాల నిధి అని పిలుస్తారు.

ఊలాంగ్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

డయాబెటిస్ రోగులకు మంచిది: టైప్ 2 డయాబెటీస్ రోగులు ఊలాంగ్ టీని క్రమం తప్పకుండా తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.. ఇది మీ బ్లడ్ షుగర్ స్థాయిని అదుపులో ఉంచడమే కాకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడం సులభం: రోజూ ఒక కప్పు ఊలాంగ్ టీ తాగే వ్యక్తులు బరువు తగ్గడం చాలా సులభం.. ఎందుకంటే ఇది బొడ్డు కొవ్వును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.. మీరు కొన్ని వారాల్లో స్లిమ్‌గా మారవచ్చు.

దంతాలను దృఢపరుస్తుంది: అయితే.. చైనాలో ఊలాంగ్ టీని సాంప్రదాయకంగా తాగుతారని.. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.. నోటి ఆరోగ్యం మెరుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. ఇది దంతాలను, ఎముకలను కూడా దృఢపరుస్తుంది.

గుండెకు మేలు చేస్తుంది: భారతదేశంలో హృద్రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు తప్పనిసరిగా ఊలాంగ్ టీని త్రాగాలి.. ఎందుకంటే ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..