Makar Sankranti 2025: ఈ 2 ప్రదేశాల్లో మకర సంక్రాంతి వెరీ వెరీ స్పెషల్.. గాలిపటాలు ఎగరవేసే పోటీలు

నవ గ్రహాల అధినేత సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగుపెడతాడు. అలా మకర రాశిలో అడుగు పెట్టినప్పుడు హిందువులు మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 14 న, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగను 14న వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ క్రమంలో దేశంలోని రెండు రాష్ట్రాల్లో భిన్నమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఆ రాష్ట్రాల్లో గాలిపటాలు ఎగరవేసే పోటీలు నిర్వహిస్తారు.

Makar Sankranti 2025: ఈ 2 ప్రదేశాల్లో మకర సంక్రాంతి వెరీ వెరీ స్పెషల్.. గాలిపటాలు ఎగరవేసే పోటీలు
Kite Festival
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2025 | 12:51 PM

కొత్త సంవత్సరం 2025లో అడుగు పెట్టాం.. భారతదేశంలో హిందువులు జరుపుకునే మొదటి పండగ సంక్రాంతితో పండుగల పరంపర మొదలైంది. జనవరి 13న భోగి పండుగను జరుపుకోనుండగా, మరుసటి రోజు అంటే 14వ తేదీన మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మూడవ రోజున కనుమగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ సంవత్సరంలో అతిపెద్ద పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యుడు తన రాశిని మార్చుకుని మకరరాశిలో అడుగు పెట్టనున్నాడు. అందుకనే ఈ పండగను మకర సంక్రాంతి పండుగ అంటారు.

ఈ మకర సంక్రాంతి పండుగ రోజున ప్రజలు స్నానం చేసి దానం చేస్తారు. అయితే ఈ పండగను తెలుగువారు మాత్రమే కాదు ఉత్తరాదివారు కూడా విభిన్న పేర్లతో జరుపుకుంటారు. ఈ పండుగతోనే ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. మకర సంక్రాంతి గుజరాత్, రాజస్థాన్‌లలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు గాలిపటాలు ఎగురవేస్తారు. గుజరాత్‌లో దీనిని ఉత్తరాయణం అంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇక్కడికి పతంగులు ఎగురవేయడానికి భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

గుజరాత్ లో సంక్రాంతి పండుగ

వాస్తవానికి హిందూ క్యాలెండర్ ప్రకారం ఉత్తరాయణ పండుగ శీతాకాలం క్రమంగా వెళ్ళిపోయి నులి వెచ్చని వేడి మొదలై వేసవికాలం ప్రారంభమవుతుంది. ఇది రైతులకు పంటలకు చేతికి వచ్చిందన్న ఆనందంతో జరుపుకునే పండగ. ఈ రోజున గాలిపటాలు ఎగురవేసే పోటీని నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజలు గాలిపటాలు ఎగురవేయడానికి వస్తారు. ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోతుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

మీకు గాలిపటాలు ఎగరడం అంటే ఇష్టం ఉంటే అహ్మదాబాద్ వెళ్లవచ్చు. మకర సంక్రాంతి రోజున ఇక్కడ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు ప్రతిచోటా “గాలిని చీలుస్తూ ఆకాశాతాన్ని తాకడానికి వెళ్తున్న గాలిపటాలను చూడవచ్చు.

జైపూర్ కైట్ ఫెస్టివల్

అంతర్జాతీయ గాలిపటాల పండుగ రాజస్థాన్‌లోని జైపూర్‌లో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ రాజస్థాన్‌లోని అత్యంత రంగుల పండుగలలో ఒకటి. ఈ పండుగ కూడా జనవరి 14న మకర సంక్రాంతి రోజున జరుపుకుంటారు. ఇక్కడ కూడా పతంగులు ఎగురవేసేందుకు విదేశాల నుంచి కూడా వస్తుంటారు.

గాలిపటాల పండుగను ఎందుకు జరుపుకుంటారు?

గాలిపటాలు ఎగరేసే పండుగను జరుపుకోవడం వెనుక ఒక కారణం ఉంది. చలికాలంలో మన శరీరం జలుబు, దగ్గు బారిన పడుతుందని ప్రజల నమ్మకం. అయితే సూర్యుడు ఉత్తరాయణంలో సంచరించినప్పుడు.. ఆ సూర్య కిరణాలు శరీరానికి ఔషధంగా పనిచేస్తాయి. అయితే మకర సంక్రాంతి పండుగ రోజున రంగుల రంగుల పతంగుల పోటీలను చూడాలనుకుంటే ఈ రెండు రాష్ట్రాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.