కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, మహా కుంభలో స్నానం.. సికింద్రాబాద్ నుంచి IRCTC ప్యాకేజీ.. పూర్తి వివరాలు మీ కోసం

మహా కుంభకు వేళాయెరా.. ప్రయగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళా జాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహా కుంభ వేడుకలపైనే అందరి దృష్టి నెలకొంది. అంతేకాదు ఈ కుంభలో పాల్గొనాలని.. పవిత్ర గంగమ్మ ని పూజించి ఒక్కసారైనా త్రివేణీ సంగమంలో స్నానమాచారించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపధ్యంలో ప్రయాజ్ రాజ్ కు వెళ్లాలనుకునే తెలుగు వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం.. సంగమ స్నానం చేసేలా ఓ స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.

కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, మహా కుంభలో స్నానం.. సికింద్రాబాద్ నుంచి IRCTC ప్యాకేజీ.. పూర్తి వివరాలు మీ కోసం
Maha Kumbh Yatra Irctc Package
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2025 | 4:29 PM

ప్రయాగ్‌రాజ్‌ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. ఇప్పటికే ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న మహా కుంభ కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది భక్తులు ఈ జాతరలో భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా.. ఎటువంటి అవాంచనీయ సంఘటలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేయాలనీ.. పవిత్ర వేడుకలో పాల్గొనాలని కోరుకునే తెలుగు భక్తులు ఏదైనా టూర్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారా.. అటువంటి వారి కోసం కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ప్రయాగ్ రాజ్ లో స్నానం కలిసి వచ్చే విధంగా సికింద్రాబాద్ నుంచి వెళ్ళే విధంగా ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది.

పవిత్ర పుష్య మాసం పౌర్ణమి రోజున అంటే జనవరి 13వ తేదీ రాజ స్నానంతో మొదలయ్యే ఈ మహా కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ అంటే మొత్తం 45 రోజుల పాటు జరగనుండి. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు సికింద్రాబాద్‌ నుంచి వెళ్లాలనుకునే తెలుగువారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆధ్యాత్మిక యాత్ర జనవరి 17వ తేదీ, 19, 24లతో పాటు ఫిబ్రవరి 2,7, 14, 16, 21వ తేదీల్లో మొదలవుతుంది. ఈ స్పెషల్ టూర్ ఈ ట్రిప్‌ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ఈ యాత్రకు సంబందించిన పూర్తి వివరాలు ఏమిటంటే..

ఈ ఆధ్యాత్మిక యాత్ర ఎలా సాగనున్నదంటే..

  1. మొదటి రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి ఈ అధ్యతిక యాత్ర మొదలవుతుంది. పర్యాటకులు ఉదయం 9:25 గంటలకు దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నం: 12791 ను ఎక్కాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది.
  2. రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు వారణాసి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. తర్వాత మీ కోసం బుక్‌ చేసిన హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం గంగ హారతిని దర్శించుకోవచ్చు. రాత్రి కాశిలో బస చేస్తారు. రాత్రి భోజనం తిని విశ్రాంతి తీసుకుంటారు.
  3. ఇవి కూడా చదవండి
  4. మూడవ రోజు ఉదయం అల్ఫాహారం తిన్న తర్వాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుని.. తర్వాత విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయం, కాలభైరవ్‌ మందిరాం, బిర్ల మదిరం వంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలను సందర్శించుకోవచ్చు. సాయంత్రం వ్యక్తీ గత పనులతో పాటు షాపింగ్‌ చేయవచ్చు. ఈ రోజు రాత్రి భోజనం చేసి ఇక్కడే నిద్ర బస చేయాల్సి ఉంటుంది.
  5. నాల్గవ రోజుఉదయం బ్రేక్ ఫాస్ట్‌ చేసి సామాన్లు తీసుకుని త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌ బయల్దేరుతారు. మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్‌ దగ్గరగా ప్రయాణీకులను విడిచి పెడతారు. మళ్ళీ ఇక్కడ నుంచి కుంభమేళా లో టెంట్ సిటీకి తీసుకుని వెళ్తారు. ఈ నాల్గవ రోజు రాత్రి మహాకుంభమేళా టెంట్‌ సిటీలోనే బస చేయాల్సి ఉంటుంది. భోజనం చేస్తారు.
  6. ఐదవ రోజు ఆధ్యాత్మిక యాత్రలో చివరి రోజు ఉదయం టిఫిన్ తిని టెంట్ ను చెక్‌ ఔట్‌ చేయాలి. పర్యాటకులు తమ లగేజీని లాకర్‌ రూమ్‌లో పెట్టి.. త్రివేణి సంగమంలో స్నానమాచరించి కుంభమేళాలో పాల్గొనాల్సి ఉంటుదని. ఈ ఐదో రోజు సాయంత్రం ప్రత్యేక వెహికల్స్‌లో పర్యాటకులను ప్రయాగ్‌రాజ్‌ లోని రైల్వే జంక్షన్‌కు తీసుకుని వస్తారు. రాత్రి 7.45 గంటలకు సికింద్రాబాద్‌ (12792) ఎక్స్‌ప్రెస్‌ రైలును ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణించి.
  7. ఆధ్యాత్మిక యాత్రలో ఆరో రోజు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటారు.

సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ … ఏ  రైల్వే స్టేషన్లలో ఎక్కవచ్చు అంటే :  కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్షా, సేవాగ్రామ్‌, నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ను పర్యాటకులు ఎక్కవచ్చు. అయితే ఈ టూర్ ని ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో మాత్రం అందరూ సికింద్రాబాద్‌లో దిగాల్సి ఉంటుంది.

టూర్‌ ప్యాకేజీ ధరలు ఏమిటంటే

  1. థర్డ్‌ ఏసీ సింగిల్ షేరింగ్‌ – రూ.48,730
  2. డబుల్ షేరింగ్‌కు – రూ.31,610
  3. ముగ్గురికి అయితే – రూ.29,390
  4. 5ఏళ్ల నుంచి 11 ఏళ్ల చిన్నారులకు (విత్ బెడ్‌) రూ.22,890
  5. 5ఏళ్ల నుంచి 11 ఏళ్ల చిన్నారులకు విత్ అవుట్ బెడ్ -రూ.14,650లు చెల్లించాల్సి ఉంటుంది.
  6. స్లీపర్‌ క్లాస్‌ సింగిల్ షేరింగ్‌- రూ 45,700 వేలు
  7. డబుల్ షేరింగ్‌- రూ.28,570
  8. ట్రిపుల్ షేరింగ్‌- రూ.26,360
  9. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌- రూ.19,860
  10. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ అవుట్ బెడ్ రూ.11,620

ప్రయాణంలో కల్పించే సౌకర్యాలు ఏమిటంటే

  1. పర్యాటకులు తీసుకున్న ప్యాకేజీ ఆధారంగా థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ లో ప్రయాణించాల్సి ఉంటుంది.
  2. ప్యాకేజీ ఆధారంగా ప్రయాణానికి బస చేయడానికి ఏసీ రూంలు, స్పెషల్‌ షేరింగ్‌ వాహనాలను ఏర్పాటు చేస్తారు.
  3. ఈ టూర్ లో మూడు రోజులు అంటే టూర్ లో రెండో రోజు నుంది నాల్గో రోజు వరకూ ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం ఉంటుంది.
  4. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో ప్రయాణ బీమా (ఇన్సూరెన్స్‌) వర్తిస్తుంది.
  5. పర్యాటక ప్రదేశంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎంట్రీ ఫీ ఉంటె దానిని పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మహా కుంభ మేళా స్పెషల్ టూర్ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా.. టూర్ ప్యాజీని బుకింగ్‌ చేసుకోవాలనుకున్నా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..