Dream Science: నిద్రలో తరచుగా ఇటువంటివి కనిపిస్తున్నాయా.. వ్యాధులు, కష్టాలు రానున్నాయని ముందస్తు హెచ్చరిక అట.. ఆ కలలు ఏమిటంటే..

ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కంటారు. కలలు కనడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల కలలు మంచిని సూచిస్తే.. మరికొన్ని రకాల కలలు ఆశుభాన్ని తెలియజేస్తూ ముందస్తుగా హెచ్చరిస్తాయని స్వప్న శాస్త్రం పేర్కొంది. అయితే కొన్ని కలలు వింతగా ఉండడమే కాదు మన జీవితాలపై రహస్యమైన లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ రోజు కొన్ని రకాల కలల వల్ల జీవితంలో రానున్న ఆశుభాలను తెలియజేస్తాయట. ఆ కలలు ఏమిటో తెలుసుకుందాం..

Dream Science: నిద్రలో తరచుగా ఇటువంటివి కనిపిస్తున్నాయా.. వ్యాధులు, కష్టాలు రానున్నాయని ముందస్తు హెచ్చరిక అట.. ఆ కలలు ఏమిటంటే..
Dreams Meaning
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2025 | 5:04 PM

స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. కొన్నిసార్లు కలలు మంచివిగా.. శుభాన్ని కలిగించేవిగా కనిపిస్తాయి. మరి కొన్నిసార్లు చాలా భయానక కలలు కనిపిస్తాయి. కొన్ని కలలు శుభప్రదమైనవిగా వర్గీకరించబడ్డాయి.. అదే సమయంలో మరికొన్ని అశుభమైనవిగా పరిగణించబడ్డాయి. కలలు ఒక వ్యక్తి జీవితంలో రానున్న సంఘటనలను సూచిస్తాయి. కొన్ని కలలు సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటాయని సూచిస్తాయి. కొన్ని కలలు జీవితంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలను సూచిస్తాయి.

డ్రీమ్ సైన్స్ అనేది కలల అర్థాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించే అతి పురాతన శాస్త్రం. శతాబ్దాలుగా.. ప్రజలు కలలను భవిష్యత్తు సంకేతాలుగా, మానసిక స్థితికి ప్రతిబింబంగా, ఆధ్యాత్మిక అనుభవాలకు మాధ్యమంగా భావిస్తారు. వ్యక్తిగత అభివృద్ధిలో కలలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భావాలు, భయాలు, కోరికలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కలలను విశ్లేషించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు.. జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చని స్వప్న శాస్త్రం పేర్కొంది.

ఈ రకమైన కలలు కనిపిస్తే రానున్న జీవితంలో ఆశుభాలకు సంకేతాలు

  1. ఎవరైనా కలలో ఎద్దుల బండిని చూస్తే.. ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్న కార్యకలాపాలు మందగించనున్నాయని సూచిస్తుంది. అంతేకాదు భవిష్యత్ వైఫల్యాలను సూచిస్తుంది.
  2. ఎవరైనా తన కలలో చిక్కటి నల్లని మేఘాలను చూస్తే.. ఇది దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. నల్ల మేఘాలను చూడటం అంటే మీ జీవితంలో త్వరలో అడ్డంకులు రాబోతున్నాయని అర్థం.
  3. ఇవి కూడా చదవండి
  4. స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలో అయినా నల్ల కాకి కనిపిస్తే అది శుభపరిణామంగా పరిగణించబడదు. ఇది పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇటువంటి కల కంటే ఎవరి మరణ వార్త అయినా వినే అవకాశం ఉంది.
  5. నల్లని బట్టలు ధరించిన వ్యక్తి లేదా నల్లని వస్తువులు తరచుగా కలలో కనిపిస్తే అది కొన్ని తీవ్రమైన వ్యాధికి సంకేతంగా పరిగణించబడుతుంది.
  6. అదేవిధంగా కలలో రక్తస్రావం కనిపించినా.. అది సుదీర్ఘ అనారోగ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
  7. ఎవరి కలలో అయినా క్రూర జంతువులు వెంబడించడం కనిపింస్తే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల కనిపిస్తే అది భారీ ఆర్థిక నష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది.
  8. ఎవరైనా తుఫాను, సుడిగాలి లేదా ఇల్లు కూలిపోతున్నట్లు కలకంటే.. అది దురదృష్టం నీడగా మిమ్మల్ని వెంటాడుతుందని అని అర్థం.
  9. కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం అశుభం. ఇలాంటి కల కంటే ఆ వ్యక్తి జీవితం సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడనున్నాడని అర్ధం.
  10. ఎవరి కలలో అయినా పక్షులు ఎగురుతున్నట్లు కనిపిస్తే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. త్వరలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనున్నారని అర్ధం అట. డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడనున్నారని తెలియస్తుందట ఈ కల.
  11. ఎవరి కలలో అయినా భారీ శబ్దాలు వినిపిస్తే .. ఆ కలకు అర్ధం ఆ కలకన్నవారి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతికి సంకేతంగా పరిగణించబడుతుంది.
  12. కలలు మనిషి ఉపచేతన మనస్సుకి వ్యక్తీకరణలని.. మనిషి అనుభవాలు, భావోద్వేగాలు, చింతలు కలలలో ప్రతిబింబిస్తాయి. కొన్ని కలలు మనిషి జీవితంలోని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయపడతాయి. కొంతమంది కలలు భవిష్యత్తు గురించి ముందస్తు సూచనలు ఇస్తాయని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.