Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం లభిస్తుందని, మరు జన్మ ఉండదని నమ్మకం.. అవి ఏమిటంటే
హిందూ మతంలో ముఖ్యమైన పండగ వైకుంఠ ఏకాదశి. ఈ తిధి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని.. మోక్షం లభిస్తుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున ఏయే చర్యలు తీసుకుంటే స్వర్గ ప్రాప్తికి చేరువ అవుతారో తెలుసుకుందాం.
హిందూ మతంలో వైకుంఠ ఏకాదశి పండుగ రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం పాటించడంతో పాటు ఆచారాలతో పూజించి శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని.. మరణానంతరం మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు నశించి, మనస్సు పవిత్రమవుతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా ఆయన విశేష ఆశీస్సులు లభిస్తాయి.
హిందూ పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఏకాదశి తిధి జనవరి 09, 2025న మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై జనవరి 10, 2025 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం వైకుంఠ ఏకాదశి వ్రతం శుక్రవారం, జనవరి 10, 2025 రోజున జరుపుకోనున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున చేయాల్సిన పరిహారాలు
- బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి: వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- పూజ స్థలం అలంకారం: పూజ స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు.. దీపాలతో అలంకరించండి.
- విష్ణువు విగ్రహం: పీటం ఏర్పాటు చేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని పరచి.. అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టండి.
- అభిషేకం: విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించి, పూవ్వులు, గంధం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని సమర్పించండి.
- ఆరాధన: విష్ణువుకి సంబంధించిన వివిధ మంత్రాలను జపించండి. లక్ష్మి విశ్నువులను స్తుతించండి.
- నైవేద్యము: విష్ణువుకి నైవేధ్యంగా అరటి పండ్లు, కొబ్బరి కాయతో పాటు పండ్లు, స్వీట్లు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అందించవచ్చు.
- హారతి: చివరగా విష్ణువుని స్తుతిస్తూ హారతి ఇవ్వండి.
- ఉపవాసం పాటించడం: రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండండి. కఠిన ఉపవాసం పాటించడం సాధ్యం కాకపోతే.. పండ్లను తినవచ్చు.
- దానధర్మం: ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
- ఈ రోజున మంత్ర జపం: “ఓం నమో నారాయణాయ”, “ఓం విష్ణువే నమః” వంటి విష్ణువు మంత్రాలను జపించండి.
- కథ వినండి: వైకుంఠ ఏకాదశి కథ వినండి.
- సాత్విక ఆహారం: ఏకాదశి పరణ అంటే ఉపవాసం విడిచే సమయంలో సాత్విక ఆహారం తినండి.
వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయకూడదంటే
- ప్రతికూల ఆలోచనలు: ఈ రోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.
- అబద్ధం: ఈ రోజున పొరపాటున కూడా అబద్దాలు చేపవచ్చు..
- కోపం తెచ్చుకోవద్దు: కోపం తెచ్చుకోవద్దు.. మహిళను దూషించవద్దు
- మాంసాహారం: మాంసాహారానికి దూరంగా ఉండండి.
- ఉల్లిపాయ, వెల్లుల్లి: ఉల్లిపాయ, వెల్లుల్లి తినవద్దు.
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత
వైకుంఠ ఏకాదశికి సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు చేసే పూజలు, ఉపవాసం, దాన ధర్మాలు పాపాలను నశింపజేయడానికి, మనస్సును శుద్ధి చేయడానికి ఉత్తమ అవకాశం. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు పొందుతారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల ప్రజలు మోక్షాన్ని పొందే మార్గం సులభతరం అవుతుందని నమ్మకం. తద్వారా మరణానంతరంవైకుంఠ ధామం చేరుతారని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.