Horse painting: ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఇలా హిందూ మతంలో ఏడు సంఖ్య సానుకులమైనదిగా భావిస్తారు. అందుకే ఏడు గుర్రాల పెయింటింగ్ శుభాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అయితే ఈ ఏడు తెల్ల గుర్రాల చిత్రం సరైన దిశలో ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే అది శుభఫలితాలను అందిస్తుంది. ప్రతికూల శక్తులని నిరోధించడంలో ఏడు గుర్రాల చిత్రం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
హిందూమతంలో ప్రతి ఒక్కరూ వాస్తుకు ప్రత్యేక ప్రధాన్యతనిస్తుంటారు. ఇంటి నిర్మాణం మొదలు..ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు పరంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో పెట్టుకునే అలంకరణ వస్తువులను కూడా వాస్తుకు అనువుగా ఉండేలా చూసుకుంటారు. ఇందులో భాగంగా కొందరు గుర్రాల ఫోటోను కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఎంతవరకు సరైనది.. గుర్రాల చిత్రాలు ఇంట్లో ఉంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుండాం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి ఇంట్లో పరుగెడుతున్న ఏడు గుర్రాల ఫొటో ఉండాలని చెబుతున్నారు. ఈ చిత్రం ఉండటం వల్ల అన్ని శుభాలే కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోకుండా ఉండొచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఏడు గుర్రాల ఫొటో మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం మీకు రావొచ్చు. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం.. 7 అంకెను శుభప్రదంగా పరిగణిస్తారు. 7 అంకెతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుందట.
అది ఎలా అంటే.. దంపతులు పెళ్లిలో ఏడు అడుగులు వేస్తారు. అలాగే భూమిపై ఏడు మహాసముద్రాలు ఉన్నాయి. ఖండాలు కూడా ఏడే ఉన్నాయి. ఇంకా సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయి. ఇలా.. ఏడు అంకె ఎంతో విలువైనదని.. అందుకే పరుగెడుతున్న ఏడు గుర్రాల ఫొటోను హాల్‌లో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
ఈ చిత్రం మీ ఇంట్లో ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రంలో ఏడు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. పెళ్లిలో వేసే సప్తపది ఏడు అడుగులు. ఇంద్రధనుస్సులో రంగులు ఏడు, ఈ భూమిపై ఉన్న మహా సముద్రాలు కూడా ఏడు, సప్త రుషులు, సూర్యుడి రథానికి ఉండే గుర్రాలు కూడా ఏడు.
ఇలా హిందూ మతంలో ఏడు సంఖ్య సానుకులమైనదిగా భావిస్తారు. అందుకే ఏడు గుర్రాల పెయింటింగ్ శుభాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అయితే ఈ ఏడు తెల్ల గుర్రాల చిత్రం సరైన దిశలో ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే అది శుభఫలితాలను అందిస్తుంది. ప్రతికూల శక్తులని నిరోధించడంలో ఏడు గుర్రాల చిత్రం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తెల్లని ఏడు గుర్రాల ఫోటోను ఇంట్లో దక్షిణ దిశగా ఉంచడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు. కెరీర్‌లో పురోగతి కనిపిస్తుందని చెబుతారు. ఈ దిశ విజయం, కీర్తితో ముడిపడి ఉండటం వల్ల దక్షిణం వైపుగా ఏడు గుర్రాల చిత్రాన్ని పెడితే మీరు అన్నింటా విజయం సాధిస్తారని అంటున్నారు.
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..