Cycling: సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి మటుమాయం..!

సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. మంచి వ్యాయామం అవుతుంది. అయితే, సైక్లింగ్ వల్ల మానసికంగానూ మంచి లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సైక్లింగ్‌ మనలోని మానసిక ఒత్తిడి సమస్యను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది ఔట్‍డోర్, ఇండోర్ సైక్లింగ్ ఏదైనా మంచిదే అంటున్నారు. శరీరంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jan 06, 2025 | 8:35 AM

సైక్లింగ్ వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ విడుదల ఎక్కువ అవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. సైక్లింగ్ వల్ల ఆందోళన, డిప్రెషన్ కూడా తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానసిక సమస్యలతో బాధపడే వారు సైక్లింగ్ చేస్తే ఉపశమనంగా అనిపిస్తుంది.

1 / 5
సైక్లింగ్ వల్ల శరీరానికి బోలెడు లాభాలు ఉంటాయి. రెగ్యులర్ సైక్లింగ్ చేస్తే కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం మంచి వ్యాయామంగా ఉంటుంది. సైక్లింగ్‍తో క్యాలరీ ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో వెయిట్ లాస్‍కు ఉపకరిస్తుంది.

2 / 5
కీళ్లు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందిపడుతున్నవారు డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు సైకిల్‌ను తొక్క‌డం అల‌వాటు చేసుకుంటే ఆయా నొప్పుల నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. సైకిల్ తొక్క‌డం వ‌ల్ల కీళ్ల‌కు సపోర్ట్ ల‌భిస్తుంది. దీంతో కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా భాగాల్లో ఉండే వాపులు, నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3 / 5
ఇక సైక్లింగ్ అనేది గొప్ప కార్డియో వ్యాయామం అంటున్నారు నిపుణులు.. దీని వ‌ల్ల గుండెకు చ‌క్క‌ని వ్యాయామం అవుతుంద‌ని చెబుతున్నారు. సైక్లింగ్ వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. రోజూ సైకిల్‌ను తొక్కితే హైబీపీ త‌గ్గుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

4 / 5
సైకిలింగ్‌ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. కండరాలను పెంచుతుంది. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ రొటీన్‌లో సైక్లింగ్‌ను కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. సైక్లింగ్‌ మీ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది ప్రతిరోజూ సుమారు 30 నిమిషాల పాటు  సైకిల్ తొక్కితే.. ఒక ఏడాదిలో దాదాపు ఐదు కిలోల కొవ్వును కరిగిస్తుందట.

5 / 5
Follow us