పెరుగు, కలబందతో హెయిర్ ప్యాక్ తయారీ చేసుకుని వాడితే జుట్టు పట్టులా మారుతుంది. ఎందుకంటే పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా చేసి, పట్టులా మెరిసేలా చేస్తుంది. ఈ ప్యాక్తో తలలోని మృతకణాలు కూడా తొలగిపోతాయి. ఇందుకోసం పెరుగు, అలోవెరా జెల్‌తో పాటుగా కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. దీనిని తరుచుగా వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరిగేలా చేస్తాయి.