Rice Water: సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా వాడండి..!
బియ్యం కడిగిన నీళ్లతో తలస్నానం చేయటం వల్ల చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు వంటివి కూడా తగ్గిపోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది. అలాగే, అన్నం వంచిన గంజి కూడా జుట్టుకు మేలు చేస్తుంది. గంజిలో ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టుకి రాయడం వల్ల జుట్టు రాలే సమస్యల తగ్గుతుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు కుదుళ్ళని బలంగా చేస్తాయి.
జుట్టు అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీరు మ్యాజిక్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యం కడిగిన నీటిని ముఖానికి, జుట్టుకి అప్లై చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. జుట్టు పెరుగుదలలో బియ్యం నీరు పరోక్ష పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టుకు అదనపు మెరుపును అందిస్తుంది. కాబట్టి, మీరు మీ హెయిర్‌కేర్ రోటీన్‌లో కూడా ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించవచ్చు. బియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇనోసిటోల్ అనే ఒక కార్బోహైడ్రేట్ వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు.
సాధారణంగా బియ్యం కడిగిన నీళ్లలో జుట్టు ఆరోగ్యానికి అవసరమైన కార్పొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల జుట్టును బియ్యం కడిగిన నీళ్లతో వాష్ చేసుకోవటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్లగా మెరుస్తూ మృదువుగా మారుతుంది. ఇది మీ జుట్టు మూలాల్లో సరైన విటమిన్ల లోపాన్ని పూరిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లతో తలస్నానం చేయటం వల్ల చుండ్రు పోతుంది. తలపై ఉండే చిన్న చిన్న పొక్కులు వంటివి కూడా తగ్గిపోతాయి. జుట్టు నిగనిగలాడుతుంది. అలాగే, అన్నం వంచిన గంజి కూడా జుట్టుకు మేలు చేస్తుంది. గంజిలో ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టుకి రాయడం వల్ల జుట్టు రాలే సమస్యల తగ్గుతుంది. ఇందులోని అమైనో ఆమ్లాలు కుదుళ్ళని బలంగా చేస్తాయి. ఇక ఈ గంజిలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్‌ని కూడా కలిపి రాయొచ్చు. వాటి వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.
బియ్యం కడిగిన నీళ్లతో హెయిర్ మాస్క్‌లు కూడా తయారు చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఒక గిన్నెలో అవిసె గింజల పొడి, బియ్యం పిండిని తీసుకోవాలి. దీనికి సరిపడా బియ్యం నీటిని కలపాలి. చిక్కటి మిశ్రమం తయారు చేసుకుని జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. తరువాత జుట్టును వాష్ చేయడానికి కూడా బియ్యం నీటిని ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. బియ్యం కడిగిన నీటిని జుట్టు మూలాల్లోకి పట్టించి స్మూత్‌గా మసాజ్ చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..