Cluster Beans : గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..! ఈ జబ్బులు రమ్మన్నా రావు..

గోరు చిక్కుడును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయని చెబుతున్నారు. గోరు చిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు. క్లస్టర్ బీన్స్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

Cluster Beans : గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..! ఈ జబ్బులు రమ్మన్నా రావు..
Cluster Beans
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 06, 2025 | 11:34 AM

ఆరోగ్యకరమైన అన్ని కూరగాయలతో పాటు గోరుచిక్కుడు కూడా ఒకటి. కానీ, గోరుచిక్కుడు తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ, ఈ కూరగాయ చాలా రుచిగా ఉండటమే కాదు.. ఇతర కూరగాయల కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. గోరు చిక్కుడును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు లభిస్తాయని చెబుతున్నారు. గోరు చిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు. క్లస్టర్ బీన్స్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

గోరుచిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం విటమిన్ సి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. ఐరన్‌ లేమి సమస్యకు చెక్‌ పెడుతుంది. గోరుచిక్కుడులోని పోషకాలు ఆస్తమాకి చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. కాబట్టి, ఆస్తమా ఉన్నవారు గోరుచిక్కుడుని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. గోరుచిక్కుడులో అనేక గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాహ్య, అంతర్గత పుండ్లు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లని దూరం చేసి మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

గోరుచిక్కుడుతో బాడీలో పేరుకుపోయిన హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఈ గోరుచిక్కుడు మంచి కొలెస్ట్రాల్‌ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డయాబెటీస్‌, బీపీతో బాధపడుతున్న వారు కచ్చితంగా వారానికి ఒక్కసారైనా గోరుచిక్కుడు తినాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు కూడా గోరుచిక్కుడు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది మహిళలు ఐరన్‌ లేమితో బాధపడుతుంటారు. అలాంటి వారికి గోరుచిక్కుడు వరంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..