మందారం టీ తాగుతున్నారా.. అద్భుతమైన ప్రయోజనాలు!

Samatha

21 march 2026

దాదాపు ప్రతి ఒక్కరి ఇంటిలో మందార పువ్వు చెట్లు అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ పూలను ప్రతి ఒక్కరూ పూజకు ఉపయోగించుకుంటారు.

మందారం

చాలా మంది పూజకు పూల కోసం, ఇంటి అందం కోసం మందార చెట్టును ఇంటి వద్ద పెంచుకుంటారు. కానీ మన ఇంటి వద్ద పూసే మందరాపూలతో అనేక ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంట.

పూజ, ఇంటి అందం

మందారపూలను ఉపయోగించి, జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చునంట. అంతే కాకుండా, దీంతో టీ చేసుకొని తాగడం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయంట. అవి ఏవో చూద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

మందారం పూలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఇందులో ఎలాంటి కెఫిన్ ఉండదు. కాబట్టి వీటితో తయారు చేసిన టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఔషధ గుణాలు

మందారం టీ తాగడం వలన ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచి, గుండెపై ఒత్తిడి తగ్గించి, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

అధిక రక్తపోటు నియంత్రణ

అదే విధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన మందారం టీ తాగడం వలన ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుంచి రక్షించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

చర్మం యవ్వనం

మందారం టీ  కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కాలేయంలో పేరుకున్న కొవ్వును తగ్గించి,  శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

లివర్ హెల్త్

అలాగే బరువు తగ్గాలి అనుకునేవారికి కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది శరీరంలో  అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గించి, బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

బరువు నియంత్రణ