AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: 40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు.. సెల్ఫ్‌ వీడియో రిలీజ్ చేసిన బాధితుడు..

యూట్యూబర్ అంకుశ్ బహుగుణా సైబర్ అరెస్ట్ స్కామ్‌లో 40 గంటలపాటు చిక్కుకున్నాడు. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో అతడు ఈ స్కామ్‌లో ఎలా చిక్కుకున్నారో వివరించాడు.  ఇటువంటి మోసాలపై అవగాహన కల్పించడానికి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నట్లు చెప్పారు.

Watch: 40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు.. సెల్ఫ్‌ వీడియో రిలీజ్ చేసిన బాధితుడు..
Digital Arrest
Lakshmi Praneetha Perugu
| Edited By: Jyothi Gadda|

Updated on: Jan 06, 2025 | 10:13 AM

Share

“నాకు జరిగిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను, ఎందుకంటే నా వంటి అనుభవం ఎవరికీ రావద్దని నేను కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా గమనించే బలమైన అభిప్రాయాలు ఉన్న మంచి స్నేహితులు ఉండడం నా అదృష్టం. ‘నేను బాగున్నాను’ అని సందేశాలు పంపుతున్నప్పటికీ, నా ప్రవర్తనలో మార్పును గమనించారు,” అని అంకుశ్ అన్నారు.

“మీందరిలో చాలా మందికి ఈ సైబర్ స్కామ్‌ల గురించి తెలిసే ఉంటుంది, కానీ వీళ్ళు ఎంత ప్రమాదకరంగా వ్యవహరిస్తారో నేను నా అనుభవలను పంచుకుంటున్నాను.వీడియోలో స్కామర్లు తనను ఎలా నడిపించారో, వ్యక్తిగత సమాచారం ఉపయోగించి తనను ఎలా భయపెట్టారో వివరించారు. “ఈ స్కామర్లు పరిశోధన చేస్తారు, మీపై ప్రభావం చూపే విషయాలను చెబుతారు. ఇది ఎవరికీ ఎదురుకావద్దని నేను కోరుకుంటున్నాను,” అని ఆయన చెప్పారు.”నేను ఇంకా కొంత షాక్‌లోనే ఉన్నాను. నా డబ్బు కోల్పయాను. నా మానసిక ఆరోగ్యం కోల్పోయాను. ఇది నాకు జరిగింది అనే విషయం నమ్మలేకపోతున్నాను. నేను దాదాపు 40 గంటలపాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నాను,” అని అంకుశ్ అన్నారు. “ఈ స్కామ్‌లు చాలా వేగంగా మీకు అర్థం అవుతాయి. కానీ, నావంటి వారు దీనిని అర్థం చేసుకోలేకపోతే, ఇది ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేను.”

ఇవి కూడా చదవండి

నన్ను ఇలా మోసం చేశారు

“జిమ్ నుండి తిరిగొచ్చినప్పుడు ఒక అంతర్జాతీయ నంబర్ నుండి ఒక కాల్ వచ్చింది.. అంతగా ఆలోచించకుండా తీసుకున్నాను. ఆ కాల్‌లో మీ కోరియర్ డెలివరీ క్యాన్సిల్ అయ్యిందని చెప్పిన ఒక ఆటోమేటెడ్ సందేశం వినిపించింది. సహాయానికి జీరో నొక్కండి అని చెప్పింది.” “నేను జీరో నొక్కాను. నా జీవితంలోనే నేను చేసిన అతిపెద్ద తప్పు. కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి కాల్ తీసుకుని, ‘మీ ప్యాకేజీలో అక్రమ వస్తువులు పట్టుబడ్డాయి,’ అని చెప్పాడు,” అని అంకుశ్ గుర్తు చేసుకున్నారు.కస్టమర్ సపోర్ట్ ప్రతినిది నాకు చెబుతూ, మీరు చైనాకు ప్యాకేజీ పంపించారు, మరియు అది ఇప్పుడు కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నాయి అని చెప్పారు. నేను భయపడ్డాను, నేను ఎలాంటి ప్యాకేజీ పంపలేదని చెప్పాను. కానీ, ఆయన నా పేరు, నా ఆధార్ నంబర్, అన్నీ ప్యాకేజీలో ఉన్నాయని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన నేరం, మీరు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్‌లో ఉంటారని చెప్పారు. మీ పేరుపై అరెస్ట్ వారెంట్ ఇప్పటికే ఉంది అని చెప్పారు,” అంకుశ్ తన వీడియోలో చెప్పారు.ఇది ఎలా జరిగిందని అడిగిన వారిని ఉద్దేశించి, “అందరూ భయానికి ఒకేలా స్పందించరు. దీనిని మూర్ఖత్వంగా భావించకుండా, మీ చుట్టూ ఉన్నవారికి అవగాహన కల్పించండి,” అని వ్యాఖ్యానించారు.ఇతరులు ఇలాంటి మోసాలకు బలికావడం నివారించేందుకు అప్రమత్తంగా మరియు సమాచారంతో ఉండాలని, అవగాహన పెంచడం ఎంత ముఖ్యమో ఆయన హితవు ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..