Snake: బతికున్న పామును మంటల్లో కాల్చారు.. మిమ్మల్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది బ్రో..?
పట్టణీకరణ పెరుగుతుండటంలో పాముల ఆవాసాలను కోల్పోతున్నాయి. దీంతో వాటికి మనం శత్రవులం అయిపోతున్నాం. పాము వ్యవసాయ భూములలో కీటక నాశనిగా పనిచేస్తుంది. అటు ఎలుకలను నియంత్రించి.. పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. ఇవేం పట్టకుండా పాము కనపడగానే కొందరు చంపేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు.
పాములు భయానకమైనవే.. కానీ మీరకున్నంత ప్రమాదకరమైనవి కాదు. తమకు ఆపద అని తలిచినప్పుడే అవి కాటు వేస్తాయి. వాస్తవానికి మనిషిని చూస్తే.. సాధ్యమైనంత త్వరగా ఆ ప్రాంత నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాయి. పాముల వల్ల మన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవేం అర్థం చేసుకోకుండా పాము కనపడగానే దాన్ని కొట్టి కొట్టి చంపుతారు. ఈ నేల అందరిది. ప్రతి జీవికి బ్రతికేందుకు సమాన హక్కు ఉంది. బలమున్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు పేట్రేగిపోకూడదు. మన దేశంలో 351 రకాల పాము జాతులు గుర్తించారు. అయితే అందులో 62 జాతులు మాత్రమే విషం కలిగినవి. మిగిలినవి విషపూరితం కావు. ఈ విషయాన్ని గుర్తెరిగి కనిపించిన ప్రతి పామును చంపకుండా ఉంటే మంచింది.
పాము అనే పదాన్ని ఉచ్చరించడం కూడా కొందరికి భయమే. గ్రామాలలో లేదా అడవుల చుట్టూ ఉన్న మానవ నివాసాలలో పాములు కనిపిస్తూనే ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పాము అంటే భయం. పాములకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియోపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆ పాముని కొట్టి.. బతికి ఉండగానే మంటల్లో తగలబెట్టడం. ఈ వీడియో మరాఠీహబ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేశారు. “ప్రతి పాపానికి కర్మ అనుభవించ తప్పదు” అని క్యాప్టన్ రాశారు. దీనిపై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం ఈ పని చేసిన వ్యక్తిపై భగ్గుమంటున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి..
వీడియో దిగువన చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..