Pizza: బాబోయ్‌ పిజ్జాలో పవర్ ఫుల్ నైఫ్.. నోట్లో పెట్టుకోగానే షాకైన కస్టమర్

అతను తన పిజ్జాను తినడం స్టార్ట్ చేశాడు. ఇంతలో నోటిలో ఏదో పళ్ల కింద పదునైన వస్తువు తగిలినట్లుగా అనిపించింది. వెంటనే అదేంటా అని తీసి చూశాడు. అది చూసిన అతడు ఒక్కసారిగా బిత్తర పోయాడు. అతడు ఆర్డర్‌ పెట్టిన పిజ్జాలో పదునైన చిన్న కత్తిముక్క దొరికింది. దాంతో అతను వెంటనే డోమినోస్ వాళ్లకుఫోన్ చేశాడు. డోమినోస్‌కి కాల్‌ చేసిన బాధిత వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని వారికి చెప్పాడు. కాగా, దానికి వారు అదేంలేదని కొట్టిపారేశారు.

Pizza: బాబోయ్‌ పిజ్జాలో పవర్ ఫుల్ నైఫ్.. నోట్లో పెట్టుకోగానే షాకైన కస్టమర్
Knife In Pizza
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2025 | 8:58 PM

గత కొద్ది రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలలో తయారు చేస్తున్న ఆహారం ఎంత నాసిరకంగా ఉంటుందో అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిసార్లు ఆహారంలో బొద్దింకలు, కప్పలు, కీటకాలు బయటపడటం కనిపించింది. మరి కొన్నిసార్లు హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత కూడా ప్రజల్లో ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. కలుషిత ఆహారంపై వివాదాలు తలెత్తినప్పుడు ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓ కంపెనీకి చెందిన దుకాణంలో ఆహార పదార్థంలో కత్తి దొరకడంతో ఇప్పుడు మరోసారి కలకలం రేపింది. ఈ వ్యవహారం మహారాష్ట్రలోని పూణెకు చెందింది.

మహారాష్ట్రలోని పూణెలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డోమినోస్‌లో పిజ్జా ఆర్డర్ చేయగా, అందులో కత్తి ముక్క దొరికిందని పూణెకు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో వేదికగా ప్రజలతో తన ఆవేదన పంచుకున్నాడు. సదరు వ్యక్తి డొమినోస్ పిజ్జా నుంచి మంచి టెస్టీ పిజ్జా ఆర్డర్ చేసుకున్నాడు. ఆర్డర్ వచ్చింది. అతను తన పిజ్జాను తినడం స్టార్ట్ చేశాడు. ఇంతలో నోటిలో ఏదో పళ్ల కింద పదునైన వస్తువు తగిలినట్లుగా అనిపించింది. వెంటనే అదేంటా అని తీసి చూశాడు. అది చూసిన అతడు ఒక్కసారిగా బిత్తర పోయాడు. అతడు ఆర్డర్‌ పెట్టిన పిజ్జాలో పదునైన చిన్న కత్తిముక్క దొరికింది. దాంతో అతను వెంటనే డోమినోస్ వాళ్లకుఫోన్ చేశాడు.

ఇవి కూడా చదవండి

డోమినోస్‌కి కాల్‌ చేసిన బాధిత వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని వారికి చెప్పాడు. కాగా, దానికి వారు అదేంలేదని కొట్టిపారేశారు. దాంతో అతడు పిజ్జాలో వచ్చిన కత్తిని వీడియో, ఫోటో తీసి వారికి పంపించాడు. దెబ్బకు డోమినోస్ సిబ్బంది దిగొచ్చినట్లుగా తెలిసింది.

వీడియో ఇక్కడ చూడండి..

డోమినోస్‌ మేనేజర్ తప్పును అంగీకరించాడని, ఈ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకోకుండా ఆపడానికి ప్రయత్నించాడని బాధిత వ్యక్తి చెప్పాడు. అయితే ఇది కేవలం అజాగ్రత్త మాత్రమే కాదు.. ప్రాణాలకు చాలా ప్రమాదకరం అంటున్నారు. ఆ అవుట్‌లెట్ నుండి పిజ్జా కొనడం మానుకోవాలని తాను అందరినీ కోరుతున్నాను అంటూ పోస్ట్‌లో వివరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..