Soybean Health Benefits: సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

సోయాబీన్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అవి మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే వివిధ రకాల పోషకాలను అందిస్తాయి. మీ ఆహారంలో సోయాబీన్‌లను చేర్చడం ద్వారా, మీరు తక్కువ పోషకాలు, కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని భర్తీ చేయవచ్చు. ఇది మీ మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

Soybean Health Benefits: సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Soya Beans
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2025 | 7:11 PM

సోయాబీన్స్‌ అనేవి బఠానీ కుటుంబానికి చెందినవి. సోయా పాలు, టోఫు తయారీలో సోయాబీ‌న్స్‌ను ఉపయోగిస్తారు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సోయాబీన్స్‌ తినడంతో వివిధ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. తరచూ మనం తినే ఆహారంలో దీన్ని భాగంగా చేర్చుకోవటం వల్ల పుష్కలమైన ప్రయోజనాలను పొందుతారని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సోయాబీన్స్‌ను తీసుకోవడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరాయిల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. దీంతో రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడవు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోయాబీన్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. సోయాను తీసుకోవడంతో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మ ఎలాస్టిసిటీని పెంచుతుంది. దీంతో ముడతలు రావు. చర్మం మెరుస్తుంది. సోయాబీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడంతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. సోయాబీన్స్‌ యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్ మాదిరి పని చేస్తాయి. ఈస్ట్రోజన్‌ స్థాయిలను ఇది రెగ్యులేట్‌ చేస్తాయి. సోయాబీన్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడంతో టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. సోయాబీన్స్‌ తీసుకోవడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇందులో ఉన్న ఫైటోకెమికల్స్‌, యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి ఉపశమనం అందిస్తాయి.

సోయాబీన్‌ పానీయాల్లో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. సోయాబీన్ తీసుకోవడంతో జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది. సోయాబీన్‌ను తీసుకోవడంతో సులభంగా బరువు తగ్గవచ్చు. సోయాబీన్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. సోయాబీన్స్‌ను తీసుకోవడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తినడంతో నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్యలు దూరం అవుతాయి. ఎముకలను బలంగా మార్చడంలో సోయా బీన్స్‌ సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌ సమయంలో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఈ టైంలో సోయా ఉత్పత్తులు తినడం మంచిది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ