- Telugu News Photo Gallery Amazing Health Benefits Of Amla Juice On An Empty Stomach In Telugu Lifestyle News
Amla Juice: చలికాలంలో వచ్చే రోగాలన్నింటిని పోగెట్టే అమృతం ఇది..! ఇలా ఖాళీకడుపుతో తీసుకుంటే..
ఆయుర్వేదంలో ఉసిరికి ప్రత్యేక ప్రధాన్యం ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఉసిరి కాయలను తిన్నా, వాటిని రసం చేసుకుని తాగినా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.. అవేంటో చూసేయండి మరి.
Updated on: Jan 05, 2025 | 4:59 PM

amla juice

ఉసిరికాయలో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుంచి మనలను రక్షిస్తాయి. ఉసిరి రసంలో విటమిన్-సి పుష్కలంగా ఉంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి ఉసిరి మనలను రక్షిస్తుంది.

ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఉసిరిలో కెరోటిన్ ఉంటుంది. ఇది దృష్టి మెరుగుదలకు సహాయపడుతుంది. రోజూ ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటిశుక్లం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఉసిరి జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందమైన చర్మం కావాలంటే ఉసిరిని తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి.. జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే అనారోగ్య సమస్యలు ధరి చేరవు.

ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మంచి శరీర ఆకృతిని పొందవచ్చు. ఉసిరి రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇది కొవ్వును కరిగించడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.




