Viral Video: అమ్మా నీకు హ్యాట్సాఫ్.. ‘మదర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ ఇవ్వాల్సిందే..! ఎందుకో మీరే చూడండి..
తన కొడుకు కాళ్లకు నల్లని మసిపూసీ అతనికి షూస్ వేసి స్కూల్‌కి రెడీ చేసి పంపించింది. కాగా, ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గామారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు సూపర్ తల్లో అంటూ ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. మీకు ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటూ సదరు మహిళ టాలెంట్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
ప్రతి నిత్యం వందలాది వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ట్రెండ్ అవుతున్నాయి. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని తమ ట్యాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు చాలా మంది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇది ఓ అమ్మ చేసిన జుగాడ్ అని చెప్పాలి. ఎలాగంటే.. ఒక తల్లి తన కొడుకును స్కూల్‌కి రెడీ చేస్తోంది. అయితే, సాక్స్ గురించి మర్చిపోయిందో లేదంటే.. రాత్రి ఉతికిన సాక్సులు ఆరలేదో తెలియదు కానీ, ఓ తల్లి తన కుమారుడిని వెరైటీ సాక్సులతో స్కూల్‌కి పంపించారు. సాక్స్ లేవనే విషయం ఎవరీకి తెలియకుండా ఉండేందుకు ఎవరూ ఊహించని ప్లాన్ వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..
వైరల్ వీడియోలో స్కూల్‌కి వెళ్తున్న సమయంలో కొడుకును రెడీ చేస్తుంది ఓ తల్లి. అయితే, సాధారణంగా స్కూలుకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా షూలతో పాటు సాక్సులను కూడా ధరించాల్సి ఉంటుంది. లేదంటే, అందరి ముందు వాళ్లకి పనిష్మంట్ తప్పదు. కొన్ని స్కూల్స్‌లో యూనిఫామ్ సరిగా లేకపోతే, ఫైన్ కూడా వేస్తుంటారు. అందుకే ఈ తల్లి తన కొడుక్కి సాక్స్‌కి బదులుగా కాళ్లకు బ్లాక్ కలర్ మసి పూసింది.
పిల్లాడికి సాక్స్ లేకుండా షూస్ వేసి స్కూల్‌కి పంపితే స్కూల్ వాళ్లు పనిష్మెంట్ ఇస్తారనే భయంతో ఈ తల్లి ఇలాంటి అద్దిరిపోయే ఐడియా వేసింది. ఇంట్లో మాడిపోయిన కడాయి ఒకటి తీసుకొచ్చి.. తన కొడుకు కాళ్లకు నల్లని మసిపూసీ అతనికి షూస్ వేసి స్కూల్‌కి రెడీ చేసి పంపించింది. కాగా, ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గామారింది.
వీడియో ఇక్కడ చూడండి..
भारतीय मम्मी सबसे ज्यादा जुगाड़ू….🥰🤣🌺❤️ pic.twitter.com/hM7giGv12q
— salony (@_salony05) December 28, 2024
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు సూపర్ తల్లో అంటూ ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. మీకు ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటూ సదరు మహిళ టాలెంట్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..