Health Tips : అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..
అరటి, బొప్పాయి పండు కలిపి తింటే ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ, ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల శరీరానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు. అరటిపండు, బొప్పాయి కలిపి తింటే ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 05, 2025 | 2:57 PM

ముఖ్యంగా అరటిపండు, బొప్పాయి అస్సలు కలిపి తినకూడదు. ఇది మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. నిజానికి, అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన అనేక పోషకాలు అందుతాయి. ఈ పండు శరీరానికి కావల్సిన పొటాషియం, క్యాల్షియంలను అందించి శరీర కండరాలను బలపరుస్తుంది. ఇక బొప్పాయిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ రెండు పండ్లు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ.. వీటిని కలిపి అస్సలు తినకూడదు.

అరటి, బొప్పాయి రెండు విభిన్న స్వభావం కలిగిన పండ్లు. అందుకే వాటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకపోవడం మంచిది.

బొప్పాయిలో ఉండే ఫైబర్ డైవర్టికులిటిస్ వంటి ప్రేగు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన ప్రేగులకు మేలు చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ కె, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

అరటిపండు అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో ఒకటి. అవి ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయి. ఇది ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

అరటి, బొప్పాయి విభిన్న స్వభావం కలిగిన పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీటిని కలిపి తినడం వల్ల వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి బొప్పాయి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు, బొప్పాయి కలిపి తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.




