AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress Balls: స్ట్రెస్ బాల్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

స్ట్రెస్‌ బాల్‌ వాడకం ఫలితంగా ఆయా వ్యక్తుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ పరిస్థితులు ఒత్తిడి, ఆందోళన అంతర్లీన కారణాలపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఒత్తిడి ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ బాల్స్ ఉపయోగపడతాయి. కానీ, తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న వారికి..

Stress Balls: స్ట్రెస్ బాల్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Stress Ball
Jyothi Gadda
|

Updated on: Jan 05, 2025 | 3:35 PM

Share

నేటి ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, వ్యాయామం లేకపోవడం వంటివి గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గత కొన్నేళ్లుగా యువకులు, చిన్నవయసు వారిలోనే ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా పలు పరిశోధనలు వెల్లడించాయి. అయితే, అన్నింటికంటే ముఖ్యంగా గుండె సంబధిత సమస్యలకు అధిక ఒత్తిడే కారణంగా అంటున్నారు నిపుణులు.

టెన్షన్ అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, నేటి కాలంలో వృద్ధుల నుండి యువత వరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడి బారిన పడుతున్నారు. ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే, అది మన రోగనిరోధక వ్యవస్థకు లేదా మన మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇది మన మానసిక సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దానిని అధిగమించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో స్ట్రెస్ బాల్‌ ఉపయోగం కూడా ఒకటి. వాస్తవానికి, స్ట్రెస్ బాల్‌ను వాడటం వల్ల చేతుల కండరాలు విశ్రాంతి పొందుతాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. స్ట్రెస్ బాల్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

స్ట్రెస్ బాల్స్ వినియోగం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడానికి ఎంతో ఉపయోపడతాయి. ఈ స్ట్రెస్ బాల్స్ ను ప్రెస్ చేయడం వల్ల ఒక్క ఒత్తిడే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రెస్ బాల్ వాడకంతో నరాలు, కండరాలు ఉత్తేజపడతాయి. అలాగే సంకోచిస్తాయి. దీనివల్ల కండరాల బలం పెరుగుతుంది. మొత్తం నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది అనవసరమైన హార్మోన్లను తగ్గిస్తాయి. ఒత్తిడి స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి మన శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. వాటిలో ఒకటి కార్టిసాల్ హార్మోన్ స్రావము. ఇది మన రక్త నాళాలను కుంచించుకుపోతుంది. దీని వలన ఆక్సిజన్ సరైన మొత్తంలో అందదు. కాబట్టి మీరు స్ట్రెస్‌ బాల్స్‌ వాడినప్పుడు ఇది ఇక్కడ కండరాలపై ఒత్తిడి తెస్తుంది. ఇది ఆక్సిజన్‌తో పాటు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. స్ట్రెస్ బాల్ చేతులకు మంచి వ్యాయామాన్ని కూడా అందిస్తుంది కాబట్టి, ఇది చేతి గాయాలను కోలుకోవడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది చేతుల వశ్యతను కూడా పెంచుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..