ఈ బంగారు మసాలా సుగుణాలు తెలిస్తే.. అస్సలు మిస్ చేసుకోరు! ఆడవాళ్లకు ఓ వరం
జాపత్రి అని పిలిచే జాజికాయ విత్తనం ఇది. దీనితో ఆరోగ్యానికి ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాపత్రి జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులో జీర్ణ లక్షణాలున్నాయి. కొన్ని సార్లు అజీర్ణం, అపాన వాయువు వంటి జీర్ణ సమస్యలను తగ్గించేందుకు దీనిని ఉపయోగిస్తారు. అలాగే జీర్ణ క్రియను ఉత్తేజ పరచడంలో కూడా జాపత్రి సహకరిస్తుంది. జాపత్రిలో ఉండే మాసిలిగ్నన్ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది.
బిర్యానీ..పేరు వినగానే చాలా మంది ఎగిరి గంతేస్తారు.. ఎందుకంటే.. బిర్యానీకి ఉన్న క్రేజ్ అటువంటిది.. అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే.. ఆ బిర్యానీ రుచికి గల కారణం మాత్రం అందులో వాడే మాసాలలే అని చెప్పాలి. ఆ మసాలాల్లో జాపత్రి కూడా ఒకటి. జాపత్రి అని పిలిచే జాజికాయ విత్తనం ఇది. దీనితో ఆరోగ్యానికి ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాపత్రి జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులో జీర్ణ లక్షణాలున్నాయి. కొన్ని సార్లు అజీర్ణం, అపాన వాయువు వంటి జీర్ణ సమస్యలను తగ్గించేందుకు దీనిని ఉపయోగిస్తారు. అలాగే జీర్ణ క్రియను ఉత్తేజ పరచడంలో కూడా జాపత్రి సహకరిస్తుంది. జాపత్రిలో ఉండే మాసిలిగ్నన్ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది.
జాపత్రిలో కిడ్నీల్లో రాళ్లను సైతం కరిగించే గుణం ఉంటుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది జీర్ణసమస్యలకు కూడా చెక్ పెడుతుంది. జాపత్రిలోని యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు. జాపత్రిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు అర్థరైటిస్ తో బాధపడేవారికి ప్రయోజనాన్నిస్తాయి. కీళ్లనొప్పులకు మంచి ఉపశమనంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా బెస్ట్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. జాపత్రిని డైట్లో చేర్చుకుంటే ఎక్కువ సేపు ఆకలివేయదు. దీంతో బరువు పెరుగుతామనే భయం ఉండదు.
జాపత్రిని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మ నిగారింపుకు తోడ్పడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండే విధంగా సహకరిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. కడుపులో గ్యాస్ రాకుండా కాపాడే అంశాలు జాపత్రిలో పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ జీర్ణక్రియ మెరుగవుతుంది. బలమైన రక్త ప్రసరణను అందించడంలో ఆరోగ్యకరమైన గుండెకు జపత్రి సహాయం చేస్తుంది. ఇది కడుపు నొప్పి, అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రేగులలో మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..