- Telugu News Photo Gallery Eating curry leaves improves the health of the body, Check Here is Details in Telugu
Curry Leaves: కరివేపాకుతో జుట్టు అందమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇలా పెంచుకోండి..
కరివేపాకు కేవలం జుట్టు ఆరోగ్యం కోసమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కరివేపాకు ఉదయాన్నే నమిలి తింటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. బరువు తగ్గడంలో, డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో కూడా సహాయ పడుతుంది..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Jan 04, 2025 | 9:52 PM

కరివేపాకు తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

కరివేపాకు నమలడం వల్ల ఇది ఆమ్లతను తగ్గించడం, జీర్ణ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం చికిత్సకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కరివేపాకు నమలడం వల్ల దుర్వాసన దూరం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే.. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సీజనల్ వ్యాధులు కూడా కంట్రోల్ అవుతాయి.

ఉదయాన్నే కరివేపాకులు నమలడం వల్ల శరీరంలో పేరుకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది. జీర్ణ సమస్యలు దూరమై జీవక్రియ అనేది మెరుగు పడుతుంది. దీంతో వెయిట్ లాస్ అవుతారు. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. కాలేయం, మూత్ర పిండాలు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి.

కరివేపాకు తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఉదయాన్నే కరివేపాకు నమిలి తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























