- Telugu News Photo Gallery Cinema photos Directors who are ready for the story and producers, but not found the hero
Directors: కథ రెడీ.. నిర్మాత రెడీ.. హీరోనే కరువు.. ఎవరా దర్శకులు.?
రిచ్ గెట్స్ రిచర్.. పూర్ గెట్స్ పూరర్ అంటూ శివాజీలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..! టాలీవుడ్‌లో ఇదే జరుగుతుందిప్పుడు. కాకపోతే రిచ్ పూర్ కాదు కానీ.. కొందరు దర్శకుల దగ్గర కథల్లేకపోయినా హీరోల డేట్స్ ఉన్నాయి. కానీ కొందరు మాత్రం హీరోల కోసం కథలు పట్టుకుని ఏళ్లకేళ్లు వేచి చూస్తున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితేంటో చూద్దామా..?
Updated on: Jan 05, 2025 | 4:30 PM

తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. కథ రెడీ, నిర్మాత రెడీ గానీ హీరో దొరకట్లేదు. ‘ఖుషి’ తర్వాత శివ నిర్వాణకు హీరో దొరకట్లేదు. నాగ చైతన్య కోసం కథ సిద్ధం చేసినా.. అది సెట్స్ పైకి రావట్లేదు.

ఇక ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత పరశురామ్‌కు ఏ హీరో దొరకలేదు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ లాంటి బిగ్గెస్ట్ బ్యానర్స్‌తో అగ్రిమెంట్స్ ఉన్నా.. ఆయనకు దర్శకత్వంలో సినిమా చేసే హీరో కుదరట్లేదు.

వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా సినిమా సినిమాకు భారీ గ్యాప్ తీసుకుంటారు వంశీ. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు. ఏకంగా అమీర్ ఖాన్ కోసమే కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే వంశీ పైడిపల్లి నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రానుంది.

డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ జగన్నాథ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పడం అంత ఈజీ కాదు.. సినిమా ఇక ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి పరిస్థితి అంతే. పవన్ కళ్యాణ్‌తో సినిమా కమిటైనా.. ఆయనున్న బిజీకి సినిమా మొదలవ్వడమైతే చాలా కష్టం.

శ్రీను వైట్ల సైతం విశ్వం తర్వాత ఓ కథ సిద్ధం చేసుకుని.. నెక్ట్స్ సినిమా కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తన కథ తగ్గ హీరోనే సెట్ అవడం కష్టంగా మారింది ఈ టాలీవుడ్ దర్శకుడుకి.




