- Telugu News Photo Gallery Cinema photos Actress Mrunal Thakur lost a lot of Opportunities due to romantic scenes
Tollywood : లిప్ లాక్స్ సీన్స్ వల్ల చాలా అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశమ్రలో భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ మూవీలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా.. ? టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. కానీ ఇప్పుడు అంతగా ఆఫర్స్ రావడం లేదు.
Updated on: Jan 04, 2025 | 9:31 PM

తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో తన అద్భుతమైన నటనతో సినీప్రియులను కట్టిపడేసింది.

కెరీర్ తొలినాళ్లల్లో బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యింది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. సూపర్ 30, జెర్సీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే తమిళంలో హీరో శివకార్తికేయన్ సరసన ఛాన్స్ రాగా.. కొన్ని కారణాలతో మిస్సైందని ప్రచారం జరిగింది.

అయితే కెరీర్ తొలినాళ్లల్లో ముద్దు సన్నివేశాల్లో నటించడం చూసి తన తల్లిదండ్రులు షాకయ్యారట. దీంతో ఆమె తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని కండిషన్స్ పెట్టారట.

అయితే ఆ కండిషన్స్ కారణంగా తాను ఎన్నో అవకాశాలు కోల్పోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మృణాల్. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించిందట.




