వారెవ్వా..ఈ ఎలుకకు ఎంత పరిశుభ్రత..! ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తోంది..వీడియో వైరల్‌..

దీనిని ఇప్పటివరకు ఒక కోటి మందికి పైగా వీక్షించారు. మూడు మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. ఇంట్లో వస్తువులను పాడు చేసే ఎలుకలే ఇలా ఎవరి సహాయం లేకుండా స్నానం చేయడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు దానిని మెచ్చుకుంటున్నారు. ఈ ఎలుక మనుషుల కంటే బెటర్ అంటూ వ్యాఖ్యనించారు.

వారెవ్వా..ఈ ఎలుకకు ఎంత పరిశుభ్రత..! ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తోంది..వీడియో వైరల్‌..
Rat Bathing Itself
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2025 | 6:52 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫన్నీ వీడియోలు, ఊహించని సంఘటనలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోస్ నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. జంతువుల జీవన విధానం, అవి చేసి చిత్రవిచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేసిన సెకండ్ల వ్యవధిలోనే ఖండాలను దాటి దూసుకెళ్తుంటాయి. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా పడి పడి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. ఇది ఒక చిలుక వీడియో..

వైరల్‌ వీడియోలో ఓ ఎలుక తన టాలెంట్‌ని చూపించుకుంటోంది. ఎలుక స్వయంగా తనకు తాను శరీరమంతా సబ్బు రాసుకొని స్నానం చేయడం వీడియోలో కనిపించింది. ఒక మనిషి ఎలాగైతే ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తాడో, అచ్చం అలాగే ఎలుక కూడా వీపు, వెన్ను భాగంలో సబ్బు రాసుకోవడం కనిపించింది. ఎలుక చేసిన వింత పని వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ఎలుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు ఒక కోటి మందికి పైగా వీక్షించారు. మూడు మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. ఇంట్లో వస్తువులను పాడు చేసే ఎలుకలే ఇలా ఎవరి సహాయం లేకుండా స్నానం చేయడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు దానిని మెచ్చుకుంటున్నారు. ఈ ఎలుక మనుషుల కంటే బెటర్ అంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..