Apollo Fish: ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ చేసుకోవచ్చు..
సాధారణంగా చేపలతో చాలా రకాల రెసిపీలు రుచి చూసే ఉంటారు. చేపలతో ఎక్కువగా ఫ్రైలు, పులుసు ఐటెమ్స్ చేస్తూ ఉంటారు. చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కానీ ముళ్లు ఉంటాయని చాలా మంది చేపలు తినేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. ముళ్లు లేని ఈ అపోలో ఫిష్ ట్రై చేస్తే.. ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారు..
సాధారణంగా చేపలతో చాలా రకాల రెసిపీలు రుచి చూసే ఉంటారు. చేపలతో ఎక్కువగా ఫ్రైలు, పులుసు ఐటెమ్స్ చేస్తూ ఉంటారు. చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కానీ ముళ్లు ఉంటాయని చాలా మంది చేపలు తినేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. ముళ్లు లేని ఈ అపోలో ఫిష్ ట్రై చేస్తే.. ఖచ్చితంగా ఫ్యాన్స్ అవుతారు. రెస్టారెంట్లకు వెళ్లే వాళ్లకు ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది. అయితే దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మరి ఈ అపోలో ఫిష్ ఎలా తాయరు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అపోలో ఫిష్‌కి కావాల్సిన పదార్థాలు:
శుభ్రం చేసిన చేప ముక్కలు, పచ్చి మర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కోడి గుడ్డు, కార్న్ ఫ్లోర్, కొద్దిగా మైదా పిండి, ధనియాల పొడి, సోయా సాస్, నల్ల మిరియాల పొడి, నిమ్మరసం, పెరుగు, ఆయిల్.
అపోలో ఫిష్ తయారీ విధానం:
ముందుగా ముళ్లు తక్కువగా ఉండే చేపలను తీసుకోవాలి. కొరమీనులో చాలా తక్కువగా ముళ్లు ఉంటాయి. ముళ్లీ తీసేసి చేప మాంసాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందలో కొద్దిగా మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా పెరుగు, నిమ్మరసం పిండి ముక్కలకు బాగా పట్టించండి. ఆ తర్వాత ఓ అరగంట పక్కన పెట్టండి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. చేప ముక్కలు డీప్ ఫ్రై చేసే ముందు గుడ్డు వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలను పక్కన పెట్టండి.
ఇప్పుడు ఒకపాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి.. అల్లం, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు, సోయాసాస్, కొద్దిగా పెరుగు వేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే అపోలో ఫిష్ సిద్ధం.