Tomato Garlic Chutney: నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!

కొన్ని సార్లు పుల్లగా, కారంగా ఏదన్నా తినాలి అనిపిస్తుంది. నాలుకకు రుచి పెరగడం కోసం చాలా మంది పచ్చళ్లు చేసుకుని తింటూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. వీళ్లు పచ్చళ్లతోనే తమ డేని స్టార్ట్ అండ్ ఎండ్ చేస్తారు. టమాటా, వెల్లుల్లితో చేసే పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ పచ్చడి టిఫిన్స్‌లోకి కూడా బాగుంటుంది..

Tomato Garlic Chutney: నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
Tomato Pickle
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 05, 2025 | 9:37 PM

కొన్ని సార్లు పుల్లగా, కారంగా ఏదన్నా తినాలి అనిపిస్తుంది. నాలుకకు రుచి పెరగడం కోసం చాలా మంది పచ్చళ్లు చేసుకుని తింటూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. వీళ్లు పచ్చళ్లతోనే తమ డేని స్టార్ట్ అండ్ ఎండ్ చేస్తారు. టమాటా నిల్వ పచ్చడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మే నెలలో చాలా మంది టమాటా పచ్చడి పెడుతూ ఉంటారు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పేది ఎక్కువ నెలలు ఉండదు. కేవలం వారం రోజులకు మించి ఉండదు. టమాటా, వెల్లుల్లితో చేసే పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ పచ్చడి టిఫిన్స్‌లోకి కూడా బాగుంటుంది. మరి ఈ టమాటా – వెల్లుల్లి పచ్చడిని ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

టమాటా – వెల్లుల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

బాగా పండిన టమాటాలు, వెల్లుల్లి, ఎండు మిర్చి, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్, ఉల్లిపాయ.

టమాటా – వెల్లుల్లి పచ్చడి తయారీ విధానం:

ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఐదు టమాటాలు తీసుకుంటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి కూడా వేసి తీసుకోవాలి. ఆ నెక్ట్స్ టమాటా ముక్కలు, ఉల్లిపాయలు వేసి ఓ ఐదు నిమిషాలు వేగాక.. కొత్తిమీర తరుగు కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇదంతా చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి టమాటా పచ్చడి సిద్ధం. ఈ చట్నీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నోరు బాలేనప్పుడు ఈ పచ్చడి చేసుకుని తింటే హాయిగా ఉంటుంది.