Sweet Corn : వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ పరార్..!

కాబట్టి శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అధిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారికి స్వీట్‌ కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. అందులో ఉండే ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి. స్వీట్ కార్న్‌లో కెరోటినాయిడ్స్, లుటిన్ ఉంటాయి. దీని వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కంటి సంబంధ సమస్యలు రాకుండా చూస్తాయి.

Sweet Corn : వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ పరార్..!
Sweet Corn
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2025 | 9:33 PM

స్వీట్‌కార్న్..వేడివేడిగా కాల్చినది లేదంటే ఉడికించినదైనా సరే..దానికి ఉప్పుకారం, మిరియాల పొడి, చాట్‌మసాలను యాడ్‌ చేసుకుని తింటే ఆ రుచే వేరప్ప అంటుంటారు భోజన ప్రియులు. అయితే, స్వీట్‌కార్న్‌ రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ చాలా బెటర్ అంటున్నారు పోషకాహార నిపుణులు. స్వీట్‌కార్న్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. స్వీట్‌కార్న్‌లో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి ఖ‌నిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుప‌డేలా చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను శరీరంలోంచి తరిమికొడతాయి.

ముఖ్యంగా బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీల‌క పాత్ర పోషిస్తాయి. స్వీట్‌కార్న్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ దివ్యౌషధంగా చెప్పాలి. స్వీట్‌కార్న్‌ల‌లో ఉండే విటమిన్‌-సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే‌ విటమిన్ బి-12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతాయి. హైబీపీ ఉన్నవారు వీటిని తినడం మంచిది. స్వీట్ కార్న్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ కణాల నష్టం, క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.

స్వీట్‌కార్న్‌ల‌లో ఉండే విటమిన్‌-సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే‌ విటమిన్ బి-12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతుంది.స్వీట్‌కార్న్‌ తిన్నాకూడా చాలా వేగంగా జీర్ణమవుతుంది. కాబట్టి శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అధిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారికి స్వీట్‌ కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. అందులో ఉండే ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి. స్వీట్ కార్న్‌లో కెరోటినాయిడ్స్, లుటిన్ ఉంటాయి. దీని వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కంటి సంబంధ సమస్యలు రాకుండా చూస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..