AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura benefits: శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

తరచూ గోంగూర తినేవారిలో కళ్లకు సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరమవుతాయని చెబుతున్నారు. గోంగూరలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హైబీపిని తగ్గిస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకునేలా చేయ‌డంలో గొంగూర ఉప‌యోగ‌ప‌డుతుంది. గోంగూరలోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా..

Gongura benefits: శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
Gongura
Jyothi Gadda
|

Updated on: Jan 05, 2025 | 7:44 PM

Share

ఆకుకూరలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే.. ఆకుకూరల్లో పాలకూర, కొత్తి మీర, బచ్చలి కూర, గొంగూరను చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే.. అన్నిరకాల ఆకుకూరల్లో కంటే గోంగురలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. తరచూ గోంగూర తినేవారిలో కళ్లకు సంబంధించిన సమస్యలు చాలా వరకు దూరమవుతాయని చెబుతున్నారు.

గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు గోంగురను తింటే.. జీర్ణక్రియ యాక్టివ్ గా పనిచేస్తుంది. అన్నం తొందరగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఎముకల సమస్యలతొ బాధపడేవారిలొ గోంగూర సమర్థవంతంగా పనిచేస్తుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో గోంగూర ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ర‌క్త హీన‌త స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు గోంగూర‌ను తరచూ తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొందుతారు.

గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర మంచి ఉపశమనం అంటున్నారు నిపుణులు. ఈ సమస్యతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఫలితం ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే పీరియెడ్స్‌ నొప్పి నుంచి గొంగూర ఉపశమనం కలిగిస్తుంది. గోంగూరలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హైబీపిని తగ్గిస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకునేలా చేయ‌డంలో గొంగూర ఉప‌యోగ‌ప‌డుతుంది. గోంగూరలోని క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..