Andhra Pradesh: పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల.. కుక్కల నుంచి కాపాడిన గ్రామస్తులు.. ఆ తరువాత..
గ్రామ పొలిమేరల్లో పంట పొలాల్లో తిరుగుతున్న ఆ జింక పిల్ల గ్రామస్తుల కంటపడింది. అయితే సమీపంలోనే కుక్కలు సంచరిస్తుండటంతో అది గమనించిన గ్రామస్తులు, జింక పిల్లను కుక్కల బారిన పడకుండా పట్టుకుని సంరక్షించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం జింక పిల్లను సమీపంలోని
అడవులు క్రమేపీ కనుమరుగవ్వటంతో వన్యప్రాణులు అభయారణ్యం నుండి జనారణ్యం బాట పడుతున్నాయి. తాజాగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బుసాబద్ర గ్రామంలో ఓ జింక పిల్ల సమీప అడవుల నుండి గ్రామ శివారు లోకి వచ్చింది. గ్రామ పొలిమేరల్లో పంట పొలాల్లో తిరుగుతున్న ఆ జింక పిల్ల గ్రామస్తుల కంటపడింది. అయితే సమీపంలోనే కుక్కలు సంచరిస్తుండటంతో అది గమనించిన గ్రామస్తులు, జింక పిల్లను కుక్కల బారిన పడకుండా పట్టుకుని సంరక్షించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అనంతరం జింక పిల్లను సమీపంలోని రామయ్యపుట్టుగలో ఉన్న ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ నివాసానికి తీసుకువచ్చారు. అక్కడే ఫారెస్ట్ అధికారులకు జింక పిల్లను అప్పగించారు గ్రామస్తులు. గ్రామస్తుల నుండి జింకపిల్లను స్వాధీనపరుచుకున్న అటవీశాఖ అధికారులు దానికి సపర్యలు చేశారు.
అనంతరం దాని ఆరోగ్య పరిస్థితి బాగుండటంతో జింక పిల్లను స్థానికంగా ఉన్న ఆరోగ్యసుంకిడి అటవీ ప్రాంతంలో దానిని విడిచి పెట్టారు. పలాస-కాశీబుగ్గ రేంజ్ అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జింక పిల్లను సంరక్షించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి