Sankranti Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ – సంక్రాంతికి 52 అదనపు ట్రైన్లు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది రైల్వేశాఖ.
ప్రతీ ఏటా సంక్రాంతికి అధిక సంఖ్యలో రద్దీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ప్రయాణికులు రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వే అధికారులు అందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. అదనపు రైళ్ల ద్వారా రద్దీని తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఉన్న రైళ్లకు బోగీలను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు పండుగను క్యాష్ చేసుకునేందుకు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయత్నిస్తున్నాయని వాపోతున్నారు ప్రయాణికులు. టికెట్ల రేట్లను భారీ స్థాయిలో పెంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు జరగకుండా రవాణాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా… సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్లను పెంచడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రైళ్ల వివరాలు, టైమింగ్స్ దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి