Health Benefits: కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం..!

కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌ అవకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్‌ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి. కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దప్పిక కాకుండా ఉంటుంది.

Health Benefits: కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం..!
Cucumber
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 06, 2025 | 1:53 PM

నేటి ఆధునిక కాలంలో ఎలాంటి రోగాలు లేకుండా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఎందుకంటే..వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా ఏదో ఒక తీవ్రమైన వ్యాధి బారినపడుతున్నారు. బీపీ, షుగర్‌, గుండె సంబంధింత సమస్యలు ఎక్కువయ్యాయి. వీటన్నింటికీ అధిక ఒత్తి, తినే ఆహారం, వారి అలవాట్లే అంటున్నారు నిపుణులు. అయితే, మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్యఔషధంలా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. అలాంటి వాటిల్లో కీర దోసకాయ ఒకటి. కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల షుగర్‌ ఉన్న వారు కీరా తినాలని సూచిస్తున్నారు. కీరదోసకాయలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి.. మూత్ర సమస్యలు తగ్గుతాయి.

కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి. కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌ అవకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే విటమిన్‌ ‘బి’తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా దోహదపడుతుంది. కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉన్నాయి. కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దప్పిక కాకుండా ఉంటుంది. కీరదోసను చక్రాలుగా తరిగి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..