- Telugu News Photo Gallery Are you suffering from puffy eyes? Can be reduced with these tips, Check Here is Details in Telugu
Swelling Eyes: కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
సాధారణంగా కళ్లు అనేవి ఉబ్బుతూ ఉంటాయి. నిద్ర సరిగా లేకపోయినా, ఒత్తిడిని ఎక్కువగా తీసుకున్నా, స్క్రీనింగ్ ఎక్కువ సేపు చూసినా కళ్లు అనేవి ఉబ్బుతూ ఉంటాయి. దీని వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా నొప్పిగా కూడా ఉంటుంది. ఈ సమస్యను చాలా సింపుల్‌గా తగ్గించుకోవచ్చు..
Updated on: Jan 06, 2025 | 2:15 PM

సాధారణంగా అప్పుడప్పుడు కళ్లు ఉబ్బిపోవడం అనేది చాలా కామన్ విషయం. కానీ తరచూ ఇదే సమస్యతో ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా సమస్య ఉన్నట్టే. ఈ సమస్య అనేది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కళ్ల కింద నల్లని వలయాలు కూడా వస్తున్నాయి.

కళ్లు ఉబ్బి ఇబ్బంది పడుతూ ఉంటే.. ఐస్ క్యూబ్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. ఐస్ క్యూబ్స్‌ని క్లాత్‌లో చుట్టి కళ్లు ఉబ్బిన చోట రుద్దండి. ఓ ఐదు నిమిసాలు ఇలానే చేస్తే.. కళ్లు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. తరచూ చేస్తే నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి. రోజుకు రెండు సార్లు అయినా చేయాలి.

టీ బ్యాగ్స్‌తో కూడా ఉబ్బిన కళ్ల సమస్యలను తగ్గించుకోవచ్చు. టీ బ్యాగ్స్‌ని ఫ్రిజ్‌లో పెట్టండి. ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత తీసి కళ్లపై పెట్టండి. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి రక్షణగా నిలుస్తాయి. కళ్లు ఉబ్బడం తగ్గుతుంది.

కళ్లపై కీరదోస పెట్టినా మంచి ఫలితం ఉంటుంది. రోజుకు రెండు సార్లు కనీసం పది నిమిషాలు అయినా కీర దోస ముక్కల్ని కళ్లపై ఉంచండి. ఫ్రిజ్‌లో పెట్టి పెట్టినా చల్లగా ఉంటుంది. కోల్డ్ క్రీమ్ రాసినా మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనెతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ముందుగా చల్లని నీటితో కళ్లను బాగా కడగండి. ఆ తర్వాత కొద్దిగా నూనెను వేళ్లతో తీసుకున్ని చాలా సున్నితంగా మర్తనా చేయాలి. దీంతో రక్త సరఫరగా సరిగా జరిగి వాపు తగ్గుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




