కొబ్బరి కాయ పోషకాల పుట్టగా చెప్పొచ్చు. కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కలు, కొబ్బరి పువ్వు, కొబ్బరి నూనె ఇలా వీటి ద్వారా అనేక పోషకాలు లభిస్తాయి. చర్మానికి, జుట్టుకు రక్షణగా నిలుస్తాయి. చాలా మంది దగ్గు వస్తుందని కొబ్బరి తినరు. కానీ కొబ్బరి తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు.