- Telugu News Photo Gallery These symptoms can tell if you have high cholesterol, Check Here is Details
High Cholesterol: ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ మధ్య కాలంలో చాలా మంది హై కొలెస్ట్రాల్‌తో బాధ పడుతున్నారు. హై కొలెస్ట్రాల్ కారణంగా బరువు బాగా పెరుగుతారు. దీంతో అనేక దీర్ఢకాలిక వ్యాధులు కూడా రావచ్చు. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండె పోటు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలతో అధిక కొలెస్ట్రాల్‌ను కనిపెట్టవచ్చు..
Updated on: Jan 06, 2025 | 2:46 PM

ప్రస్తుతం కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో హై కొలెస్ట్రాల్ కూడా ఒకటి. శరీరంలో ఒక్కసారి చెడు కొవ్వు పెరిగిందంటే.. అనేక దీర్గకాలిక వ్యాధులు రావడం ఖాయం. డయాబెటీస్, రక్త పోటు వంటి ప్రమాదకర వ్యాధులు రావచ్చు.

శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చేప కింద నీరులా ఎటాక్ చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తెలుసుకునేందుకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. రక్త నాళాల్లో పేరుకు పోయి.. రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోతే.. ముందుగా కాళ్లపై ఎఫెక్ట్ చూపిస్తుంది. రక్తనాళాల్లో దగ్గరకు ఇరుగ్గా మారతాయి. దీని ఫలితంగా కాళ్లలో నొప్పులు ఎక్కువగా వస్తాయి. తిమ్మిర్లు ఎక్కువగా పడతాయి. ఎక్కువగా నీరసం, అలసటగా ఉంటుంది.

పాదాల షేప్ కూడా మారిపోతుంది. చర్మం, గోళ్లలో మార్పులు కనిపిస్తాయి. బ్లడ్ సర్కిలేషన్ సరిగ్గా జరగకపోతే కండరాల నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా పిరుదులు, తొడలు పిక్కలు, పాదాల్లో కనిపిస్తుంది. ముఖంలో కూడా చాలా మార్పులు కనిపిస్తాయి.

కళ్ల దగ్గర మచ్చలు కనిపిస్తాయి. కళ్ల కింద తెలుపు, నారింజ, పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. పాదాల చాలా చల్లగా మారతాయి. గోళ్లు అనేవి చాలా మందంగా తయారవుతాయి. నోట్లో నుంచి ఎక్కువగా చెడు వాసన వస్తున్నా అధిక కొలెస్ట్రాల్‌కు కారణమే. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




