Mahesh Babu : సినిమాలు లేకున్నా,ట్రెండ్ అవుతున్న సూపర్ స్టార్.. ఎలా అంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబుగురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఆయనంటే చాలా మందికి ఇష్టం. ఇక గుంటూరు కారం సినిమాతో తన అభిమానులను పలకరించిన ఈ హీరో నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయినా ఈ హీరో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు.

Samatha J

|

Updated on: Jan 06, 2025 | 5:11 PM

సాధారణంగా సినిమాలు సెట్స్‌పై లేకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా.. చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు సూపర్ స్టార్. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..!

1 / 5
ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించడంలో అందరికంటే ముందుంటారు మహేష్ బాబు. ఇప్పుడూ ఇదే జరిగింది. తాజాగా సూపర్ స్టార్ తెగ ట్రెండ్ అవుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు. ఏ సినిమా లేదు.. కొత్త సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా లేదు.. అయినా కూడా తన క్రేజ్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్నారు మహేష్.

2 / 5
ఉన్నట్లుండి మహేష్ మ్యాజిక్ వెనక కారణం గుంటూరు కారం సినిమా ప్రీమియర్సే. ఏడాది కింది సినిమాకు ఇప్పుడేం ప్రీమియర్స్ అనుకోవచ్చు.. కానీ బాబు ఫ్యాన్స్ అలా ఉన్నారు మరి. న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరు కారం స్పెషల్ షోస్ వేసారు. దాంతో ఇటు సినిమా.. అటు సూపర్ స్టార్ ఇద్దరూ ట్రెండ్ అవుతున్నారు.

3 / 5
కొన్ని రోజులుగా పూర్తిగా రాజమౌళి సినిమాపై ఫోకస్ చేసారు మహేష్ బాబు. SSMB29 కోసం బాగానే మేకోవర్ అవుతున్నారు. కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా.. జుట్టు, గడ్డం పెంచేస్తున్నారు. అలాగే కండలు తిరిగిన బాడీతో దర్శనమిస్తున్నారు. మహేష్ ఎప్పుడు బయటికి వచ్చినా.. ఆయన లుక్‌తో సోషల్ మీడియా తగలబడిపోతుందంతే.

4 / 5
SSMB29 మేనియా ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు సినిమా మొదలయ్యాక, అఫీషియల్ లుక్ వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరికి వచ్చేసింది. అన్నీ కుదిర్తే సమ్మర్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పనున్నారు జక్కన్న అండ్ టీం. మ్యాటర్ ఏదైనా.. సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్నారు మహేష్ బాబు.

5 / 5
Follow us