Watch: బాబోయ్ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేసిన పర్యాటకులు..
అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో పలువురు దీనిపై తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. పర్యాటకుల్లో నియంత్రణ ఉండాలని లేదంటే అందమైన ప్రదేశాలన్నీ పాడవుతాయని కొందరు వ్యాఖ్యానించారు. అలాగే దీని వల్ల ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉందని మరికొందరు చెబుతున్నారు.
ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించే దేశం జపాన్. ఇక్కడ అనేక అందమైన నగరాలు పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందాయి. 2024 చివరి నాటికి దాదాపు 35 మిలియన్ల మంది పర్యాటకులు జపాన్‌ను సందర్శించినట్టుగా సమాచారం. అయితే, అందమైన ప్రదేశాలపై ప్రజల ఆసక్తి కారణంగా ఆయా ప్రదేశాలు రద్దీగా మారుతున్నాయి. జపాన్‌కు చెందిన ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. బాబోయ్ ఇదేం రద్దీరా బాబో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపించే ప్రదేశాన్ని ‘సెవెన్త్ రింగ్ ఆఫ్ హెల్’ అని ఒక వ్యక్తి అభివర్ణించాడు. జపనీస్ ఆర్ట్ బ్లాగ్ స్పూన్ అండ్ టమాగో యజమాని జానీ వాల్డ్‌మాన్ Xలో షేర్ చేసిన వీడియోతో ఇలా రాశారు. జపాన్ సాంస్కృతిక కేంద్రం క్యోటో ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందులో క్యోటోలోని హిగాషియామా ప్రాంతంలోని ప్రసిద్ధ సనెంజాకా వీధిలో విపరీతమైన ప్రజల రద్దీ కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉన్నారు. ఇక్కడ చేరుకున్న ప్రజలు చాలా మంది చీమల్లా కనిపిస్తున్నారు. అదుపు తప్పి వచ్చిన సందర్శకుల్ని ఓ అధికారి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Unpopular opinion: Kyoto is the 7th ring of hell right now pic.twitter.com/8VhmA4V6EK
— Spoon & Tamago (@Johnny_suputama) December 22, 2024
ఇది నగరంలోని ప్రసిద్ధ కియోమిజు-దేరా ఆలయానికి వెళ్లే మార్గం. ఈ మార్గం గుండా చాలా మంది ఆలయానికి వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా ప్రజలు రెండు వైపులా నివసిస్తున్నారు. అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో పలువురు దీనిపై తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. పర్యాటకుల్లో నియంత్రణ ఉండాలని లేదంటే అందమైన ప్రదేశాలన్నీ పాడవుతాయని కొందరు వ్యాఖ్యానించారు. అలాగే దీని వల్ల ఇక్కడి ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉందని మరికొందరు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..