Viral Video: సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. గాలిపటం ఎగురవేసిన వానరం.. అమేజింగ్ వీడియో

నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ఇంటి డాబాపై ఉన్న ట్యాంక్‌పై కోతి కూర్చుని ఉంటుంది. అయితే.. దాని చేతికి గాలిపటం మాంజా చిక్కింది.. ఆ తర్వాత ఏం జరిగింది..? కోతి ఏం చేసింది.. అనేది వీడియోలో చూడండి..

Viral Video: సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. గాలిపటం ఎగురవేసిన వానరం.. అమేజింగ్ వీడియో
Monkey Video Viral
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 06, 2025 | 5:14 PM

దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఊరు-వాడ.. పల్లె-పట్టణం అనే తేడా లేకుండా మకర సంక్రాంతి జోష్ కనిపిస్తోంది.. చాలా మంది సెలవులు రావడంతో పట్టణాల నుంచి పల్లె బాట పట్టారు.. అయితే.. మకర సంక్రాంతి సందర్భంగా చాలా ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే.. చాలామంది గాలి పటాలు ఎగురవేస్తూ సంక్రాంతికి సన్నద్ధమవుతున్నారు.. అయితే ఈ పండుగకు మీరేనా.. మేము కూడా ఎంజాయ్ చేస్తాం అనేలా ఓ కోతి గాలిపటం ఎగురవేస్తూ కనిపించింది.. ఓ వానరం గాలిపటం ఎగురవేసే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ఇంటి డాబాపై ఉన్న ట్యాంక్‌పై కోతి కూర్చుని ఉంటుంది. అయితే.. దాని చేతికి గాలిపటం మాంజా చిక్కింది.. దీంతో అది దాన్ని పట్టుకుని గాలిపటాన్ని గుంజుతూ కనిపించింది.. గాలిపటం తెగగానే.. దాని మాంజా కోతి దగ్గరకు వచ్చింది. దీంతో కోతి ఒక్కసారిగా దాన్ని లాగుతూ కనిపించింది.. అచ్చం మనిషి మాదిరిగానే మాంజాను లాగుతూ కనిపించింది.

వీడియో చూడండి..

వాస్తవానికి కోతి గాలిపటాన్ని ఎగురవేస్తున్న ఘటన చాలా పాతది.. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది.. అయితే.. ఎక్కడ జరిగింది..? ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలియదు.. కానీ.. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఈ వీడియోను వేలాది మంది వీక్షించి.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అచ్చం మనిషి మాదిరిగానే కోతి గాలిపటం ఎగురవేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..