AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణ డ్రిల్ మ్యాన్.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు దక్కిన ఘనత..

కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. తన అసాధారణ ప్రతిభతో సామాన్యుడి నుంచి అసామాన్య వ్యక్తిగా.. ఒకేసారి నాలుగు రికార్డులు సాధించి. గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి భారతదేశాన్ని గర్వపడేలా చేశాడు. అసాధారణ సాహసాలతో ఆ యువకుడు "డ్రిల్ మ్యాన్" పేరుతో ప్రసిద్ధి పొందాడు. సామాన్యుడి నుంచి అసామాన్య వ్యక్తిగా.. ఎదిగిన ఆ డ్రిల్ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణ డ్రిల్ మ్యాన్.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు దక్కిన ఘనత..
Drill Man Krantikumar
Follow us
M Revan Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 06, 2025 | 12:02 PM

యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి పనికెర సత్తయ్య తాపీ మేస్త్రి, తల్లి వ్యవసాయ కూలీగా ఉన్నారు. క్రాంతి కుమార్ సూర్యాపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఇంటి నుండి పంపే డబ్బుల కోసం ఎదురు చూడకుండా మిర్చి బండీ వద్ద పనిచేసేవాడు. ఈ క్రమంలోనే ఎవరికీ సాధ్యంకాని పనులు చేయాలన్న భావనతో ఇంటర్‌ నుంచే చిన్న చిన్న ప్రదర్శనలు సాధన చేస్తుండేవాడు. ప్రధానంగా వేడివేడి నూనెలోంచి బజ్జీలను తీయడం, ముక్కులో మొలలు (సీలలు) కొట్టుకోవడం వంటివి సాధన చేస్తుండేవాడు. వీటిని కాలేజీలో, ఇతర చోట్ల ప్రదర్శించడం ప్రారంభించాడు. ముక్కులో నాలుగు ఇంచుల డ్రిల్‌ (గోడలను రంధ్రాలు చేసే మిషన్‌) వేసుకోవడం, మేకులను కొట్టుకోవడం వంటి ప్రదర్శనలు చేశాడు. ప్రధానంగా 2011లో ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ షోలో కాంత్రి ప్రదర్శించిన విన్యాసాలతో వెలుగులోకి వచ్చాడు.

*దేశ విదేశాల్లో ప్రదర్శనలు…

క్రాంతి తన అసాధారణ సాహసాలు, అపార ధైర్యంతో రాష్ట్రంలో పలు వేదికలపై విన్యాసాలు ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతూ, “డ్రిల్ మ్యాన్” పేరుతో ప్రసిద్ధి పొందాడు. అమెరికా, మలేషియా, సింగపూర్‌, స్పెయిన్‌, ఇటలీలోనూ విన్యాసాలు ప్రదర్శించి రికార్డులు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

ఓకే వేదికపై నాలుగు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు..

2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలాన్‌ నగరంలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు ప్రదర్శించాడు. నాలుగు ప్రదర్శనలు చేసి అన్నింటా సత్తా చాటి ఒకేసారి నాలుగు రికార్డులు సాధించాడు. మొదటిది- 60 సెకన్లలో 57 టేబుల్‌ ఫ్యాన్లను నాలుకతో ఆపి ఔరా అనిపించాడు. రెండవది కత్తులను గొంతులో పెట్టుకుని తాడు సాయంతో 1,944 కిలోల బరువున్న వాహనాన్ని ఐదు మీటర్ల మేర లాగి రెండో రికార్డు సాధించాడు. 60 సెకన్లలో 22 సార్లు నాలుగు అంగుళాల మేకులను ముక్కులో కొట్టుకోవడం మూడో రికార్డు సాధించాడు. నాలుగు రికార్డ్‌ 300 డిగ్రీల వేడి నూనెలో 60 సెకన్లలో 17 చికెన్‌ ముక్కలను బయటకు తీశాడు. ఒకే వేదికపై నాలుగు ప్రదర్శనలు చేసి నాలుగు వరల్డ్ రికార్డులను సాధించాడు. క్రాంతి కుమార్ చేసిన సాహసాలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయక పోవడంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ ఆయనకు తన బుక్‌లో చోటిచ్చింది. ఇటీవల ఆ సంస్థ నిర్వాహకులు క్రాంతికుమార్‌కు అవార్డులు ప్రదానం చేశారు.

క్రాంతి కుమార్ సాధించిన నాలుగు వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డుల పట్ల అడ్డగూడూరు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇది నిజంగా అపూర్వమైన సాహసం కొందరు ప్రశంసిస్తున్నారు. తమ గ్రామానికి కాదు దేశానికే పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాడని క్రాంతి కుమార్ స్నేహితులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.