AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: ఏసీబీ విచారణకు KTR.. ఆఫీసు ముందు హైడ్రామా…

బంజారాహిల్స్‌ ACB ఆఫీసు ముందు కేటీఆర్‌ కారును పోలీసులు ఆపారు. లీగల్ టీంను వెంట తీసుకురావద్దని ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్‌ కీలక కామెంట్స్ చేశారు. న్యాయవాదిని తీసుకొచ్చే హక్కు ఉంది. నేను మర్యాదగా విచారణకు సహకరిస్తున్నా.. అని చెప్పారు కేటీఆర్.

KTR: ఏసీబీ విచారణకు KTR.. ఆఫీసు ముందు హైడ్రామా...
KT Rama Rao
Ram Naramaneni
|

Updated on: Jan 06, 2025 | 10:48 AM

Share

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఏసీబీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం నందినగర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో ACB నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు ఆయన హాజరయ్యేందుకు బంజారాహిల్స్‌ ACB ఆఫీస్‌‌కు వెళ్లారు. ఆ సమయంలో కేటీఆర్ పక్కన అడ్వకేట్ ఉండటంతో.. పోలీసులు ఆయన కారును గేటు వద్ద ఆపారు. అయితే అడ్వకేట్లతోనే లోపలకి వెళ్తానని.. వారి సమక్షంలోనే విచారణ జరగాలన్నారు కేటీఆర్. అడ్వకేట్లను అనుమతించబోమని ఏసీబీ అధికారులు చెప్పారు. అలా కోర్టు ఆర్డర్‌లో లేదన్నారు. ఈ క్రమంలో అధికారుల రెస్పాన్స్ కోసం అరగంట పాటు ఆఫీసు గేటు బయటే వేచి చూసిన కేటీఆర్.. ఏసీబీ అడిషినల్ ఎస్పీకి తన వివరణ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కేటీఆర్‌ను ఫార్ములా-Eరేస్‌ కేస్‌ వెంటాడుతోంది.  ఒకవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ.. నోటీసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఏసీబీ ఆదేశిస్తే.. మంగళవారం విచారణకు రావాలని నోటీసులిచ్చింది ఈడీ.

ఆ 55 కోట్ల చుట్టూనే ఇప్పుడు పంచాయితీ..!  పాలనాపరమైన అనుమతుల్లేకుండా అంత మొత్తం ఫారిన్‌ కంపెనీకి ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.. అది కూడా డాలర్లలో ఎందుకిచ్చారు..! ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఆగమేఘాలపై ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సూత్రధారులెవరు..! ఇదే తేల్చనుంది ACB.

అసలు, కేటీఆర్‌పై ఈడీ మోపిన అభియోగాలు ఏంటి?. ఏ కారణాలు చూపుతూ కేసు నమోదు అయ్యిందో ఒకసారి తెలుసుకుందాం.

  • హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌కి సంబంధించి.. రూల్స్‌కి విరుద్ధంగా 54కోట్ల 88లక్షల రూపాయల్ని విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారనేది అభియోగం.
  • ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు లేకుండా.. డబ్బు చెల్లించారనేది ప్రధాన అభియోగం.
  • కేటీఆర్‌ ఆదేశాలతో రూల్స్‌కి విరుద్ధంగా FEOతో ఎంవోయూ చేసుకున్నారని.. 600కోట్లు చెల్లించేలా ఉద్దేశపూర్వకంగా ఈ తప్పుడు ఒప్పందం చేసుకున్నారనేది మరో అభియోగం
  • అసలు, ఎంవోయూకి ముందే కేటీఆర్‌ ఆదేశంతో డబ్బు చెల్లించేశారని.. ఆ తర్వాతే సీఎంవోకి సమాచారం ఇచ్చారన్నది ఇంకో అభియోగం
  •  కేబినెట్‌ ఆమోదం లేకుండా ఇలా డీల్‌ చేసుకోవడం.. ఆర్టికల్‌ 299 ఉల్లంఘన అంటూ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది ఏసీబీ. మోసం, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యల కింద కేటీఆర్‌పై అభియోగాలు మోపింది ఏసీబీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.