AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చర్లపల్లి.. ది గేమ్‌ ఛేంజర్‌… నేడే రిలీజ్‌.. ప్రత్యేకతలు తెలుసుకుందాం పదండి

చర్లపల్లి, ది గేమ్‌ ఛేంజర్‌... నేడే రిలీజ్‌. యస్‌..సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై పని భారం తగ్గించడానికి, తానున్నానంటూ ముందుకొచ్చింది ఈ బాహుబలి రైల్వే టెర్మినల్. ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభం కానుంది చర్లపల్లి రైల్వే స్టేషన్. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Hyderabad: చర్లపల్లి.. ది గేమ్‌ ఛేంజర్‌... నేడే రిలీజ్‌.. ప్రత్యేకతలు తెలుసుకుందాం పదండి
Cherlapally Railway Station
Ram Naramaneni
|

Updated on: Jan 06, 2025 | 7:39 AM

Share

వెల్‌కమ్‌ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. యస్‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. జంట నగరాల్లో ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి, సిటీ శివార్లలో చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది రైల్వే శాఖ. భారీ వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్‌… అత్యంత విశాలంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కొలువుదీరింది. ఎయిర్‌పోర్ట్‌ లుక్‌తో కనిపించే చర్లపల్లి రైల్వే స్టేషన్‌…ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది.

9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇది హైదరాబాద్‌లో నాల్గో అతి పెద్ద రైల్వే స్టేషన్‌. మొత్తం రూ. 430 కోట్ల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్‌లో మొత్తం 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌ రేంజ్‌లో టెర్మినల్‌ నిర్మాణం జరిగింది. హైదరాబాద్‌లో వందేళ్ల తర్వాత మరో అతి పెద్ద రైల్వే స్టేషన్‌…ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సిద్ధం కావడంతో…సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుంది. అయితే చర్లపల్లి నుంచి హైదరాబాద్‌ నగరంలోకి రోడ్‌ కనెక్టివిటీని పెంచాల్సి ఉందంటున్నారు స్థానికులు.

లక్షమంది ప్రయాణికులకు ఉపయోగకరం

చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైతే 50 వేల మంది నుంచి లక్షమంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. చర్లపల్లి లో ఇప్పటికే 25 జతల రైళ్లు ఆగుతుండగా.. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే మరో 30 రైళ్ల దాకా అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రయాణికులు వేగంగా గమ్య స్థానాలకు చేరే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, విశాఖ వైపు వెళ్లే రైళ్లను..చర్లపల్లి నుంచి నడపనున్నారు.

ప్రస్తుతం చర్లపల్లిలోని 9 ప్లాట్‌ఫామ్‌లలో రెండింటిని ఎంఎంటీఎస్‌ ట్రైన్స్‌ కోసం కేటాయించారు. ప్రయాణికుల కోసం ఏసీ, నాన్‌ ఏసీ వెయిటింగ్‌ హాల్స్, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, టికెట్‌ కౌంటర్లు వంటివి సిద్ధం చేశారు. ప్రధానిమోదీ వర్చువల్‌గా ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో చర్లపల్లిలో జరిగే ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.     

Follow Us
10 లక్షలకు ఆ సినిమా కొన్న ఉపేంద్ర.. కట్ చేస్తే.. నిర్మాతకు రూ.50
10 లక్షలకు ఆ సినిమా కొన్న ఉపేంద్ర.. కట్ చేస్తే.. నిర్మాతకు రూ.50
హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్ వేశాడుగా..
హిట్‌మ్యాన్ ఇచ్చిన టిప్స్‌తో ఇండియాకే స్కెచ్ వేశాడుగా..
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
వర్షాకాలంలో జబ్బులను తరిమికొట్టే సూపర్ డ్రింక్.. డేలీ తాగితే
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?