Watch: 40అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన ఇల్లు..ఈ ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
తక్కువ స్థలంలో కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలనే కల ఇప్పుడు సాకారం అవుతుంది. కేవలం 12 అడుగుల వెడల్పు ఉన్న ప్లాట్‌లో నిర్మించిన 3 అంతస్తుల భవనం ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అద్భుతమైన ఆ ఇంటి నిర్మాణం, డిజైన్‌ను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పర్ఫెక్ట్ హౌస్ డిజైన్ మిడిల్ క్లాస్ లగ్జరీ హోమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది.
ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన నగరంలో ఇల్లు ఉండాలని కలలు కంటాడు, అందులో కుటుంబం మొత్తం హాయిగా జీవించాలని కోరుకుంటాడు. అయితే ఆస్తుల ధరలు పెరుగుతున్న స్పీడ్‌తో మధ్యతరగతి ప్రజల సొంతింటి కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. కొన్నిసార్లు ప్రజలు చిన్న ప్లాట్‌ను కొనుగోలు చేస్తారు. కానీ, వారి కోరిక మేరకు అక్కడ ఇల్లు నిర్మించుకోలేరు. అంతేకాదు..ఇంటి నిర్మాణానికి కావాల్సిన పర్మిషన్ రావటం కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ముందు, వెనుక రెండు వైపులా ఖాళీ స్థలం తప్పనిసరిగా వదిలిపెట్టాలి. దీంతో మిగిలిన స్థలంలోనే నివాసయోగ్యమైన ఇళ్లను నిర్మించడం చాలా కష్టంగా మారింది. కానీ, చిన్న స్థలంలో ఆశల ఇంటిని ఎలా నిర్మించుకోవాలో ఈ వీడియో నిరూపిస్తుంది.
చిన్న స్థలంలో నిర్మించిన రాయల్ హౌస్‌కు సంబంధించిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ ఇల్లు నిర్మాణం 12 అడుగుల వెడల్పు 40 నుండి 45 అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. పైగా ఇది చాలా విలాసవంతంగా కూడా కనిపిస్తుంది. తక్కువ స్థలంలో ఇంటిని నిర్మించాలనుకునే వారికి ఇది సరైన డిజైన్.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఇంటి ఎలివేషన్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
zindagi.gulzar.h Instagramలో షేర్ చేసిన పోస్ట్‌లో మూడు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు అందరినీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా వీడియోని జాగ్రత్తగా చూస్తే, దాని వెడల్పు 12 అడుగుల కంటే ఎక్కువ కాదు. కానీ దాని నిర్మాణం, డిజైన్ చూస్తే విశాలంగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు.. దాని ఎలివేషన్ చాలా గొప్పగా కనిపిస్తుంది. అలా దానిని చూస్తుంటే, దానినే చూస్తుండాలి అనిపిస్తుంది. ఇది సరిగ్గా ఒక బాక్స్ ఆకారంలో చాలా ఆకర్షణీయమైన డిజైన్‌తో నిర్మించారు. మూడు అంతస్తులలో మధ్యలో నుండి కుడి, ఎడమ ఆకార రూపకల్పనను సిద్ధం చేశారు. దీని కారణంగా, ఇల్లు రెండు వైపులా పూర్తి, అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తుంది. మూడో అంతస్తులోని ముందు జాగర్‌ను రాయల్ ప్లేస్‌లా ఖాళీగా ఉంచారు. ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..