AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boiled Egg : ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉడికించిన గుడ్డును ఎంత టైంలోపు తినాలి..

ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు, త్వరగా వెయిట్ తగ్గేందుకు టైట్స్ ఫాలో అవుతూ పౌష్టికమైన ఆహారం తింటున్నారు. దీనిలో ప్రోటిన్ కోసం ఎక్కువగా ఎగ్స్ తీసుకోవడం చేస్తుంటారు. ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వాటిన వండడం కూడా చాలా ఈజీ. అయితే, కొంతమంది వాటిని ఉదయం ఉడికించుకొని రాత్రికి తింటూ ఉంటారు. లేదా ప్రిజ్‌లో నిల్వ ఉంచుకొని తింటారు. కానీ ఉడికించిన గుడ్డును ఇలా ఎక్కువ ఉంచి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉడికించిన గుడ్డును ఎంత సమయంలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Boiled Egg : ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉడికించిన గుడ్డును ఎంత టైంలోపు తినాలి..
Boiled Egg Shelf Life
Anand T
|

Updated on: Mar 21, 2026 | 3:29 PM

Share

చాలా మంది ఉడికించిర గుడ్డును ఎప్పుడు తిన్నా ఏం కాదని అనుకుంటారు. కానీ అది చాలా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అమెరికా ఆరోగ్య సంస్థలైన CDC, USDA మార్గదర్శకాల ప్రకారం.. ఉడకబెట్టిన గుడ్లను ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదు, ఎందుకంటే దీనివల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఉడికించిన గుడ్లు తినడానికి ఎంత సులభమో, వాటి భద్రత కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మీరు వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే, 3 – 4 రోజుల్లోగా తప్పకుండా తినేయాలని. లేకపోతే అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. మీరు వాటిని అలాగే తినడం వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

గుడ్లు చెడిపోకుండా ఎలా స్టోర్ చేయాలి

  • గుడ్లు ఉడకబెట్టిన తర్వాత, వాటిని రెండు గంటల్లోగా ఫ్రిజ్‌లో పెట్టండి.
  • అలాగే ఉండికించిన గుడ్ల పెంకులు తీయకండా అలానే స్టోర్ చేయండి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
  • మీరు ఉడికించిన గుడ్లు ప్రిజ్‌లో పెట్టాలి అనుకుంటే ఉష్ణోగ్రత 4°C లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
  • గుడ్లను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం వల్ల దుర్వాసన, బ్యాక్టీరియా రాకుండా నివారించవచ్చు.

గుడ్డు పాడైపోయిందో లేదో ఎలా గుర్తించాలి?

  • మీరు మర్చిపోయి ఎక్కువ రోజులు ఉండికించిన గుడ్డును అలానే పెట్టి ఉంటే కొన్ని సార్లు అవి పాడైపోవచ్చు.కాబట్టి వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం
  • మారు పెంకు తీయగానే గుడ్లు ఘాటైన వాసన లేదా కుళ్ళిన వాసన వస్తే అది పాడైపోయిందని అర్థం
  • గుడ్డు పెంకు జిగటగా అనిపించినా అది పాడైపోయినట్టే
  • పెంకు గుడ్డుకు గట్టిగా అతుక్కుని ఉంటే కూడా కొన్ని సార్లు గుడ్డు పాడైపోయి ఉండవచ్చు.
  • గుడ్డు లోపలి నుండి నీటిలాంటి పదార్థం బయటకు వస్తే కూడా గుడ్డు పాడైపోయినట్టు

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us